Upasana: లక్ష్మీ ప్రణతి కోసం రామ్ చరణ్ భార్య కాస్ట్లీ గిఫ్ట్..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సినిమా వాళ్ల గురించి ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి. సినిమా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే దాని గురించి మీడియాలో హడావుడి ఎక్కువగా ఉంటుంది. అలాగే వారు వాడే బ్రాండెడ్ ప్రొడక్ట్స్ గురించి ఇట్టే వైరల్ అయిపోతుంటాయి. స్టార్ హీరోలు వాళ్ళ ఫ్యామిలీ గురించి అయితే జనాలకు కూడా ఆసక్తి ఎక్కువే. ముఖ్యంగా ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి, మహేష్ బాబు భార్య నమ్రత, రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి వార్తలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. వాళ్లు ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా సరే మీడియా ఫోకస్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. అసలు విషయానికి వస్తే.. రామ్ చరణ్ భార్య ఉపాసన, ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి మధ్య మంచి స్నేహం ఉందన్న విషయం మనకు తెలిసిందే. వీరిద్దరూ స్టార్ హీరోల భార్యలైనప్పటికీ చాలా క్లోజ్ గా హెల్తీ రిలేషన్ షిప్ ను మెయింటెన్ చేస్తూ ఉంటారు.

తాజాగా వీరి స్నేహం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తారక్ భార్య లక్ష్మీ ప్రణతికి ఉపాసన ఓ హ్యాండ్ బ్యాగ్ ని గిఫ్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఆమె ధరించిన డ్రెస్ ని కూడా ఉపాసన గిఫ్ట్ చేసిందట. ఈ ఫోటోలో కనిపిస్తున్న హ్యాండ్ బ్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. చాలా స్టైలిష్ గా, ట్రెండీగా ఉండే ఈ హ్యాండ్ బ్యాగ్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అమ్మాయిలకు తెగ నచ్చేసిన ఈ బ్యాగ్ కాస్ట్ అక్షరాల.. 3 లక్షల 28 వేల 145 రూపాయలు. అంతేకాదు 45 వేలు విలువ చేసే ఓ డ్రెస్ ని కూడా ఉపాసన లక్ష్మీ ప్రణతి కోసం తీసుకుందట. ఇలా వీరి అనుభంధం గురించి తాజాగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది.

For More Updates :

- Advertisement -

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు