SkandaPreReleaseThunder: స్కంద ట్రైలర్ ఎప్పుడంటే ?

SkandaPreReleaseThunder

ఉస్తాద్ రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న స్కంద సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ రానే వచ్చింది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై భారీ పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్నస్కంద సినిమా సెప్టెంబర్ 15 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవబోతున్న విషయం తెలిసిందే.

యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇటీవలనే రామ్ పోతినేని పుట్టినరోజు సందర్భంగా స్కంద సినిమాకి సంబంధించి రిలీజ్ చేసిన టీజర్ ప్రేక్షకులకు బాగా నచ్చడంతో సినిమాపై మరింత బజ్ పెరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శర వేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా ట్రైలర్ ఈ నెలలోనే విడుదల చేయడానికి రెడీ అయ్యారు మేకర్స్.

శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా రామ్ పోతినేని మొదటి పాన్ ఇండియా సినిమాగా రాబోతుండటంతో సినిమా ప్రమోషన్స్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యారు. కాసేపటి క్రితమే స్కంద సినిమాకు సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ చేసిన మూవీ యూనిట్, ఈ సినిమా ట్రైలర్ ఆగస్ట్ 26న రిలీజ్ చేయనున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఇక ఈ పోస్టర్ లో పచ్చని పంట పొలాల మధ్యల మడత మంచం వేసుకొని కాఫీ తాగుతున్న రామ్, అతని పక్కనే యెల్లో సారిలో కూర్చొని ఉన్న శ్రీలీల ఉండగా..ఈ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది .ఇక పోస్టర్ ను బట్టి చూస్తే స్కంద సినిమాలో లవ్ స్టోరీ కూడా ప్రాధాన్యత ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తోంది. మరీ రోజు రోజుకు ఆసక్తి పెంచుతున్న స్కంద ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు