Skanda: అచ్చుగుద్దినట్టు అఖండ ను దింపేసిన బోయపాటి- హిట్ దక్కేనా ?

యంగ్ హీరో రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రాబోతున్న లేటెస్ట్ సినిమా టైటిల్ గ్లిమ్స్ వీడియోను కాసేపటి క్రితం రిలీజ్ చేసారు. అఖండ సినిమా లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తరువాత బోయపాటి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇక లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరో రామ్ గత కొద్దీ సంవత్సరాలుగా మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తుండగా 2019 లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఆ కల నెరవేరింది.

ఇస్మార్ట్ శంకర్ సినిమా ఇచ్చిన ఊపుతో రెడ్, వారియర్ సినిమాలతో మాస్ హీరోగా నిలబడాలని ట్రై చేయగా, అవి బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ లుగా నిలిచాయి. దాంతో ఈ హీరో కెరీర్ అయోమయంలో పడిపోయింది. మాస్ సినిమాలు చేయాలా, లేక క్లాస్ సినిమాలనే కంటిన్యూ చేయాలా అనే కన్ఫ్యూజన్ లో పడిపోయాడు. అప్పుడే బోయపాటి రామ్ పోతినేని దగ్గరికి సరైన మాస్ స్క్రిప్ట్ తీసుకురావడంతో ఈ సినిమా పట్టాలెక్కింది.

ఇటీవలనే రామ్ పుట్టినరోజు సందర్భంగా థండర్ పేరుతో సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా, ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకొని, రిలీజ్ కు రెడీ అయిన కూడా నిన్న మొన్నటి వరకు సినిమా టైటిల్ పై క్లారిటీ రాలేదు. గత కొద్దీ రోజులు సినిమా టైటిల్ ఏది పెట్టాలనే కన్ఫ్యూజన్ లో ఉన్న మూవీ టీం చివరకు స్కంద అనే పేరు ను ఫైనల్ చేసింది.

- Advertisement -

గురు పౌర్ణమిని పురస్కరించుకొని ఈ టైటిల్ గ్లిమ్స్ వీడియోను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. అయితే ఈ గ్లిమ్స్ వీడియోలో రామ్ చెప్పిన డైలాగ్ హైలెట్ అయింది. కానీ డైలాగ్ డెలివరీ నుంచి బాడీ లాంగ్వేజ్ వరకు అచ్చుగుద్దినట్టు బాలకృష్ణ ను ఫాలో అయినట్టు స్పష్టంగా తెలుస్తోంది. అలాగే సినిమా టైటిల్ ఫార్మాట్ కూడా అఖండ సినిమాను గుర్తుకు తెచ్చేలా ఉండటంతో బోయపాటి అఖండ సెంటిమెంట్ గట్టిగ ఫాలో అవుతున్నడని అర్థమవుతోంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 15న రిలీజ్ కు రెడీ అవుతోంది. మరీ ఈ సినిమా కూడా అఖండ అలాగే బ్లాక్ బస్టర్ అవుతుందో లేదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు