SidKiara: కియారా అద్వానీ పెళ్లి డ్రెస్ ధర ఎంతంటే ?

బాలీవుడ్ సెలబ్రిటీస్ అయిన కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా ఈ నెల 7వ తేదీన పెళ్లితో ఒక్కటైన సంగతి విధితమే. చాలా రోజులుగా ప్రేమించుకుంటున్న ఈ జంట చివరికి పెళ్లితో ఒక్కటైంది. రాజస్థాన్ లోని జైసల్మీర్ సూర్యఘడ్ ప్యాలెస్ లో అత్యంత గ్రాండ్ గా ఈ పెళ్లి జరిగింది. ఇరువురి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. అయితే ఈ పెళ్లి గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతుంది.

పెళ్లి జరిగిన జైసల్మీర్ సూర్యఘడ్ ప్యాలెస్ కి ఒక్క రోజుకే రూ. 2 కోట్లు చెల్లించారట. అలాగే పెళ్లికి వచ్చిన అతిథుల కోసం ఏకంగా 70 లగ్జరీ కారులను కేటాయించారు. దీంతో అతిథులకు భోజనాలు వడ్డించడానికి దాదాపు 500 మంది క్యాటరింగ్ వాళ్లను తీసుకువచ్చారట. ఇలా చెప్పుకుంటూ వెళ్లే ఈ బాలీవుడ్ ప్రేమ జంట పెళ్లికి భారీగానే ఖర్చు అయినట్టు తెలుస్తోంది.

అయితే పెళ్లిలో అందరి చూపు.. కియారా అద్వానీ వేసుకున్న డ్రెస్ పైనే ఉంది. లేత గులాబీ కలర్ లో కనిపిస్తున్న ఆ గురించి నెట్టింట్లో ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఈమె ధరించిన ఆ డ్రెస్ విలువ ఎంత అంటూ నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ డ్రెస్ ను కియారా ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుందట. వెండి, బంగారం పూత ఉన్న డ్రెస్ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఈ డ్రెస్ ధర అక్షరాలా.. రూ. 50 లక్షలు. ఒక పెళ్లి డ్రెస్ కే ఇంత భారీగా ఖర్చు చేసిన ఈ జంట రిసెప్షన్ ను కూడా గ్రాండ్ గా ప్లాన్ చేస్తుంది. ఫిబ్రవరి 12న ముంబైలో రిసెప్షన్ పార్టీ జరగనుంది. దీనికి బాలీవుడ్, టాలవుడ్ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు