Game Changer: శంకర్ కి ఇంకెంత టైమ్ కావాలి.. దిల్ రాజు పట్టించుకోడా?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్,శంకర్ కాంబినేషన్ లో “గేమ్ చేంజర్” సినిమా తెరకెక్కుతుందన్న విషయం తెలిసిందే. 2021 లో ప్రారంభమైన ఈ సినిమా ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైన తర్వాత నుండి రెగ్యులర్ షూట్ ప్రారంభమైంది. బిగినింగ్ లో శర వేగంగా షూటింగ్ జరుపుకుంది ఈ సినిమా. ఆ స్పీడ్ చూసి 2023 సమ్మర్ వరకు గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోతుందని రామ్ చరణ్ ఫ్యాన్స్ అనుకున్నారు.

అయితే ఎప్పుడైతే శంకర్ పెండింగ్ లో ఉన్న సినిమా ఇండియన్ 2 తిరిగి మళ్లి షూటింగ్ మొదలైందో గేమ్ చేంజర్ కి బ్రేకులు పడ్డాయి. అటు శంకర్ పూర్తిగా ఆ సినిమాపైనే దృష్టి పెట్టడం, ఇటు రామ్ చరణ్ ఉపాసన ప్రెగ్నెంట్ కావడం వల్ల ఇంటికే పరిమితం కావడం వల్ల షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. అయితే దిల్ రాజు మాత్రం ఏమి పట్టనట్టు తన ఇతర సినిమాల షూటింగ్ లు చూసుకుంటూ ఉన్నాడు. అయితే ఇది తెలిసిన ఫ్యాన్స్ దిల్ రాజుని సోషల్ మీడియా వేదికగా తిట్టిపోశారన్న సంగతి తెలిసిందే.

తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం గేమ్ ఛేంజర్ షూటింగ్ ఇంకా 80 రోజుల షూటింగ్ పార్ట్ మిగిలి ఉందట. టాకీ పార్ట్ కూడా బాగా పెండింగ్ లో ఉంది. అంటే ఈ సంవత్సరం మొత్తం గేమ్ ఛేంజర్ షూటింగ్ జరుపుకోనుంది. అదికూడా ఇండియన్ 2 సినిమా పూర్తి అయ్యాకే జరుగుతుంది. మరి ఇక తాజాగా ఉపాసన డెలివరీ కూడా అయిపోయి చరణ్ కి పాప పుట్టడంతో రామ్ చరణ్ ఆల్మోస్ట్ ఫ్రీ అయ్యాడనే చెప్పొచ్చు. మరి ఇప్పుడైనా గ్లోబల్ స్టార్ తేరుకొని శంకర్ , దిల్ రాజులకి నచ్చ జెప్పి గేమ్ ఛేంజర్ షూటింగ్ త్వరగా కంప్లీట్ చేస్తే మంచిదని చరణ్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు