Dil raju : రిలీజ్ కి రెడీ అయిన పవన్ కళ్యాణ్ సినిమా- హడావిడి మాములుగా లేదుగా

“పాట వచ్చి పదేళ్లయింది అయిన పవర్ తగ్గలే” అని గబ్బర్ సింగ్ సినిమాలో కమెడియన్ అలీ చెప్పిన డైలాగ్ గుర్తొస్తుంది. పవన్ కళ్యాణ్ తొలిప్రేమ రీ-రిలీజ్ హడావుడి చూస్తుంటే.. !

పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి జంటగా నటించిన తొలి ప్రేమ సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లవ్ స్టోరీ సినిమాలు తీయడంలో మేటి దర్శకుడిగా పేరుతెచ్చుకున్న కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ అయ్యి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఈ వారం ఈ సినిమాని రీ-రిలీజ్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఇటీవలనే మూవీ టీం ప్రెస్ మీట్ నిర్వహించగా దిల్ రాజు తొలిప్రేమ సినిమా గురించి మాట్లాడుతు సినిమాతో తనకున్న అనుభవాల్నిషేర్ చేసుకున్న విషయం తెల్సిందే. అప్పట్లో తొలి ప్రేమ రిలీజప్పుడు ఒక పక్క ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ ఉన్న కూడా సినిమాని చూడటానికి ఎంతో మంది వచ్చారని, తనకి ఫ్లాప్ వచ్చిన ప్రతిసారి తొలిప్రేమను రీ-రిలీజ్ చేసేవాడినని చెప్పుగా ఆ వ్యాఖ్యలు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి.

- Advertisement -

అయితే దిల్ రాజు చెప్పిన ఆ హడావిడి అంత అప్పుడే కాదు, ఈరోజుకు కూడా ఆ సినిమాక్రేజ్ అలాగే ఉందనిపిస్తోంది. ఇప్పటికే హైద్రాబాద్ లో ఆర్టిసి క్రాస్ రోడ్స్ వద్ద తొలి ప్రేమ రీ-రిలీజ్ అవుతున్న థియేటర్స్ అన్నిటిలో పవన్ కళ్యాణ్ కటౌట్స్ పెట్టేసారు ఫ్యాన్స్ , పవన్ కళ్యాణ్ కొత్త సినిమా రిలీజ్ కి ఎంత హడావిడి చేస్తారో 25ఏళ్ళ తరువాత రిలీజ్ అవ్వబోతున్న తొలిప్రేమ సినిమాకి కూడా అంతే హడావిడి చేయడం నిజంగా విశేషమనే చెప్పాలి. మరో పక్క ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలేవీ రిలీజ్ అవ్వక పోతుండటంతో తొలిప్రేమ సినిమానే మళ్ళీ చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నట్టు తెల్సుతోంది. ఇప్పటికే ఖుషి సినిమా రీ-రిలీజ్ కి రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ రాగా, ఇప్పుడు తొలిప్రేమ సినిమాకి ఎంత వస్తాయనేది సర్వత్రా ఆసక్తి మొదలైంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు