Chiranjeevi: భోళా శంకర్ తో వంద కోట్లు సాధ్యమేనా?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం “భోళా శంకర్”. వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి చేసిన చిత్రం అవడంతో ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడినా, ఇది వేదాళం రీమేక్ అని తెలియడంతో ఫ్యాన్స్ డిసపాయింట్ అయ్యారు. అటు సాధారణ ప్రేక్షకులు సైతం ఈ సినిమా పై అంత ఆసక్తి కనబరచలేదు. పైగా ఈ సినిమాకు పదేళ్లుగా సినిమా తీయని మెహర్ ని దర్శకుడ్ని చేయడంతో మెగాఅభిమానులే ఈ సినిమాని లైట్ తీసుకున్నారు. దీనికి తోడు ఆ మధ్య రిలీజ్ అయిన మోషన్ పోస్టర్ లు ఫస్ట్ లుక్, లిరికల్ సాంగ్ తో సహా ఏది ఆకట్టుకోలేకపోయింది.

అయితే ఎప్పుడైతే భోళా శంకర్ టీజర్ విడుదల అయిందో అప్పట్నుంచి ట్రేడ్ వర్గాల్లో ఇంట్రెస్ట్ మొదలైంది. అసలేం ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా వచ్చిన ఈ టీజర్ బాగా ఆకట్టుకోవడంతో ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. మరీ ఓ రేంజ్ లో అయితే లేదు గాని ఫ్యాన్స్ ఊహించినదానికంటే బెటర్ గానే ఉండడంతో మరో వాల్తేరు వీరయ్య లా సినిమా ఉండబోతుందని ఫ్యాన్స్ అంచనాలు పెంచేసుకున్నారు. అయితే అన్ని సినిమాల ఫలితాలు ఒకేలా ఉండవు కదా. గత ఏడాది విడుదలైన గాడ్ ఫాదర్ బాగున్నప్పటికీ దాని ఒరిజినల్ అందరు చూసేసరికి ఆ రీమేక్ ని లైట్ తీసుకున్నారు. ఫలితంగా గాడ్ ఫాదర్ ఓపెనింగ్స్ కే పరిమితమైంది.

ఇప్పుడు మళ్ళీ మరో రీమేక్ తో చిరు వస్తున్నాడు. టీజర్ బాగుండడంతో ఈ సినిమా వందకోట్లు రాబట్టొచ్చని అభిమానులంటున్నారు. అటు ట్రేడ్ విశ్లేషకులు కూడా సినిమాలో కంటెంట్ బాగుండి ఒరిజినల్ కి ఈ సినిమాకి ఏదైనా చేంజ్ చేసి ఉంటే చిరు కు మరో 100కోట్ల సినిమా రావడం ఖాయం అంటున్నారు. ఇక మెగాస్టార్ చిరు ఖాతాలో ఇప్పటికే మూడు 100కోట్ల సినిమాలున్నాయి. తెలుగు సీనియర్ స్టార్ హీరోల్లో వంద కోట్ల సినిమాలున్న ఒకే ఒక్క స్టార్ గా చిరు మిగిలాడు. మరి భోళా శంకర్ తో మరోసారి ఆ ఫీట్ ను సాధిస్తాడేమో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు