Project K: రెమ్యునరేషన్‌లో దీపిక పదుకునేను మించిన వాళ్లు లేరు?

ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమా రెమ్యూరేషన్ డీటేల్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. వైజయంతి బ్యానర్ పై అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ప్రభాస్ కి ఉన్న పాన్ ఇండియా మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ కి ఏమాత్రం వెనకాడకుండా ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నరట.

యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా, సైన్స్ ఫిక్షన్ జానర్ లో ఈ సినిమా ఉండబోతుంది. హాలీవుడ్ రేంజ్ మేకింగ్ తో హై క్వాలిటీ విజువల్ ఎఫెక్ట్స్ తో సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో దీపికా పడుకునే హీరోయిన్ గా నటిస్తుండగా, లోకనాయకుడు కమల్ హాసన్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు ఇక అమితాబ్ బచ్చన్, దిశాపటాని ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

అయితే ఈ సినిమాకి గాను ప్రభాస్ ఏకంగా 150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. అలాగే కమల్ హసన్ ఈ సినిమాకి కోసం 4 వారాల పాటు డేట్స్ కేటాయించగా అందుకుగాను ఆయనకి 20 కోట్లు రెమ్యునరేషన్ ఇస్తున్నారంట. ఇక దీపికా పదుకునెకి 10 కోట్లు, అమితాబ్ బచ్చన్, దిశాపటాని, మిగితాఆర్టిస్ట్ లకు కలిసి 20 కోట్లు ఇవ్వగా, ప్రొడక్షన్ కాస్ట్ దాదాపు 400 కోట్లతో కలిసి ఈ సినిమాకి మొత్తంగా 600 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు ప్రచారం నడుస్తోంది.

- Advertisement -

మొదట్లో ఆదిపురుష్ సినిమాకి కూడా బడ్జెట్, ఇంత పెడుతున్నాం, అంత పెడుతున్నాం గొప్పలు చెప్పిన మూవీ టీం, చివరికి సినిమాని ఏ మేరకు తీశారో అందరూ చూసారు. అయితే ఇప్పుడు ప్రాజెక్ట్- కే కూడా బడ్జెట్ విషయంలో ఆదిపురుష్ ధోరణిలో వెళ్తుండటంతో అందరిలో సినిమాపై ఒకింత అనుమానాలు మొదలయ్యాయి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు