Sapthami Gowda : సాహసం చేసింది.. హిట్ కొట్టింది

కన్నడలో విడుదలై పెద్ద విజయం సాధించి, రూ. 100 కోట్ల వసూళ్లు చేసి ఇంకా స్పీడ్ గా దూసుకెళ్తున్న చిత్రం కాంతార. రిషబ్ శెట్టి స్వియ రచన, దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఒక కన్నడ లోనే కాదు అన్ని భాషల్లోనూ సత్తా చాటుతుంది. తెలుగు వర్షన్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై విడుదల కాగా ఇప్పటి వరకు దాదాపు 25 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం పుష్కలంగా ఉంది. ఈ చిత్రానికి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించడమే కాదు, హీరో గా కూడా చేశాడు.

కాంతార చిత్రం దర్శకత్వానికి, ఫైనల్ ఎపిసోడ్ లో రిషబ్ శెట్టి నటన పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను మెప్పించింది. ఈ చిత్రంలో రిషబ్ శెట్టి తర్వాత ఎక్కువగా ఆకట్టుకున్న పాత్ర లీల. హీరోయిన్ సప్తమి గౌడ ఈ లీల పాత్రను పోషించింది. సాధారణంగా డీ గ్లామర్ పాత్రలు చేయడానికి హీరోయిన్లు రిస్క్ చేయరు. కానీ సప్తమి గౌడ్ ఆ రిస్క్ చేసి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంది.

ఆలాగే లీల పాత్ర కోసం సప్తమి గౌడ పెద్ద సాహసమే చేసింది. ఈ విషయాన్ని ఓ సందర్భంలో ఆమె వెల్లడించింది. డైరెక్టర్ గారు లీల పాత్ర గురించి వివరిస్తున్న సందర్భంలో ”లీల పాత్రకు రెండు వైపుల ముక్కు పుడకలు ఉండాలని చెప్పారు. అవి కూడా సహాజంగా ఉండాలని చెప్పారు. దీంతో చేసేదేమీ లేక రెండు వైపుల నిజంగానే ముక్కు పుడకలు కుట్టించుకున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు