Karthi : నట విశ్వరూపం

తమిళ స్టార్ హీరో కార్తీ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. “యుగానికి ఒక్కడు” సినిమా నుంచి ఇటీవల విడుదలైన “పొన్నియన్ సెల్వన్” PS -1 వరకు ప్రతి సినిమా తమిళం తో పాటు తెలుగులోనూ రిలీజ్ చేస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు కార్తీ. ఆయన నటిస్తున్న తాజా చిత్రం “సర్దార్”. కార్తీ, రాశిఖన్నా హీరో, హీరోయిన్లుగా పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో యాక్షన్ త్రిల్లర్ గా తెరకెక్కుతున్న చిత్రం సర్దార్.

ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తోంది. ఈ చిత్రంలో రజిషా విజయన్, చుంకి, లైలా, అశ్విన్, బాలాజీ శక్తి వెల్, పలువురు, ఇతర నటీనటులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమా గురించి వరుస అప్డేట్ లను ప్రకటిస్తూ సినిమాపై అంచనాలను క్రియేట్ చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై విపరీతమైన అంచనాలను క్రియేట్ చేశాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కార్తీ ఈ సినిమాలో దాదాపు 15 గెటప్స్ లలో కనిపించనున్నాడట. ఇంతకుముందు వీడొక్కడే సినిమాలో ఓ పాట కోసం పది గెటప్స్ లో కనిపించాడు సూర్య. ఇప్పుడు ఈ వార్త వాస్త‌వ‌మే అయితే సూర్యని అధిగమించనున్నాడు కార్తీ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు