Veerupaksha : మరొక బంపర్ ఆఫర్ కొట్టేసిన సంయుక్త

ప్రస్తుతం టాలీవుడ్ లో సంయుక్త మీనన్ హావ నడుస్తుంది. ఇప్పటికి వరకు ఆమె చేసిన సినిమాలన్నీహిట్ మీద హిట్ అవుతుండటంతో, ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్ల లకి సంయుక్త లక్కీ చార్మ్ అయిపొయింది.

పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగులో హీరోయిన్ పరిచయమైన ఈ కేరళ కుట్టి, మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకుంది. ఆ తరువాత రిలీజైన కళ్యాణ్ రామ్ బింబిసారా సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవడంతో సంయుక్త క్రేజ్ ఇంకా పెరిగింది. ఆ తరువాత వచ్చిన ధనుష్ హీరోగా వచ్చిన బైలాంగ్వేజికల్ సినిమా సార్ కూడా 100కోట్ల కలెక్షన్స్ తో సంచలన విజయం సాధించింది. దాంతో సంయుక్త టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపొయింది.

అయితే ఇటీవలనే ఆమె నటించిన విరూపాక్ష సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఈ సినిమాకి గాను సంయుక్త పర్ఫామెన్స్ కి చాలా మంచి పేరు వచ్చింది. గ్లామర్ రోల్ లోనే కాకుండా తన నటనతో విరూపాక్ష సినిమాలో ఆమె అందరికి మెస్మరైజ్ చేసింది. అయితే లేటెస్ట్ గా సంయుక్త మరో బంపర్ కొట్టేసిందని ఫిలిం నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అల్లు అర్జున్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుందని ఇటీవలనే ఒక న్యూస్ వచ్చింది.

- Advertisement -

ప్రస్తుతం పుష్ప2 సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్న అల్లు అర్జున్ , ఈ సినిమా తరువాత గీత ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా చేయనున్నాడు. ఆ సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా సంయుక్తని తీసుకోడానికి చర్చలు జరుగుతున్నాయంట. ప్రస్తుతం వరుస హిట్స్ తో దూసుకుపోతున్న సంయుక్త డేట్స్ తరువాత పట్టుకోవడం కష్టమవుతుందేమో అనే ఉద్దేశ్యంతో ముందుగానే సంయుక్త కి అడ్వాన్స్ కూడా ఇచ్చారని టాక్. త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కంప్లిటైన తరువాత బన్నీ సినిమాపై అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రానుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు