Rama Prabha : బిగ్ క్వశ్చన్..శరత్ బాబు ఆస్తులు ఎవరి సొంతం ?

ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరనీయంగా నిలిచిపోయే అతి తక్కువ మంది నటుల్లో శరత్ బాబు ఒకరు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శరత్ బాబు గత సోమవారం (మే22)న తుది శ్వాస విడిచారు. మల్టీ ఆర్గాన్ ఫెల్యూర్ వల్ల ఆయన చనిపోయారు.అయితే శరత్ బాబు మరణం తర్వాత ఆయన ఆస్తులు ఎవరి సొంతం అనే దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతుంది. మూడు పెళ్లిళ్లు చేసుకున్న శరత్ బాబుకు కూమారులు గానీ, కూతుళ్లు గానీ లేకపోవడంతో ఈ చర్చ మరింత హాట్ టాపిక్ గా మారింది.

శరత్ బాబు ముందుగా ప్రముఖ లేడీ కమెడియన్ రమాప్రభను పెళ్లి చేసుకున్నారు. కానీ, వీరి బంధం ఎక్కువ రోజులు నిలవడలేకపోయింది. రమాప్రభతో డైవర్స్ తర్వాత స్నేహలతను పెళ్లి చేసుకున్నారు. రెండో పెళ్లి కూడా ఎక్కువ రోజులు నిలవలేదు. స్నేహలతతో డైవర్స్ తర్వాత శరత్ బాబు మూడో పెళ్లి చేసుకున్నట్టు అనేక వార్తలు వచ్చాయి. కానీ, దానిపై శరత్ బాబు ఎప్పుడూ మాట్లాడలేదు. అయితే ఇప్పుడు శరత్ బాబు ఆస్తులు ఆయన మాజీ భార్యలకు చెందుతుందా? లేదా ఆయనకు తోబుట్టువులకు చెందుతుందా ? అనేది బిగ్ క్వశ్చన్ గా మారింది. శరత్ బాబుకు 8 మంది అన్నాదమ్ములు ఉన్నారు. అలాగే 5 గురు అక్కాచెల్లెల్లు ఉన్నారు.

అయితే శరత్ బాబు ఏదైనా వీలునామా రాశారా అనేది కూడా ప్రస్తుతానికి ఎవరికీ తెలియదు. దీంతో ఆయన ఆస్తులు ఎవరి సొంతం అవుతాయనేది చర్చకు దారితీస్తుంది. శరత్ బాబు 70వ దశకం నుంచే సినిమాల్లో నటించడం వల్ల చాలా ఆస్తులను కూడబెట్టాడు. హీరో, విలన్ పాత్రలతో పాటు సినిమాల్లో ప్రధాన పాత్రలలో కూడా శరత్ బాబు కనిపించాడు. దీంతో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లో స్థిరాస్తులు చాలానే ఉన్నాయి. అలాగే చరాస్తులు కూడా ఎక్కువగానే ఉన్నట్టు టాక్ వినిపిస్తుంది.

- Advertisement -

అయితే ఈ నేపథ్యంలో శరత్ బాబు సోదరుడు.. ఇటీవల ఆస్తులపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఇది తమ కుటుంబ విషయమని, దీనిలో ఎవరి జోక్యం ఉండదని చెప్పారు. అయిన కూడా శరత్ బాబు ఆస్తులకు వారసుడు ఎవరు అనేది అన్నదానిపై చర్చ ఆగడం లేదు. దీనిపై క్లారిటీ రావాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు