Nagarjuna : ఎందుకంత పిచ్చి ?

ప్రతి ఒక హీరో తనకు తాను ఒక పాత్రలో చూడటానికి ఎక్కువగా ఇష్టపడతారు. అది స్పోర్ట్స్ మ్యాన్ గానో.. పోలీస్ ఆఫీసర్ గానో.. ప్లే బాయ్ లేదా లవర్ బాయ్ గానో కనిపించాలని అనుకుంటారు. అందుకోసం దర్శకులతో ప్రత్యేకంగా స్టోరీని రాసుకుని మరీ సినిమాలు చేస్తారు. అలాంటి సినిమాల్లో ఆయా హీరోలు ప్రాణం పెట్టి నటిస్తారు. అయితే అలాంటి సినిమాలు హిట్ అవుతాయా ? లేక బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లపడుతాయా ? అనేది మాత్రం ప్రేక్షకులే డిసైడ్ చేస్తారు.

టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం చేస్తున్న సినిమాలను చూస్తే.. తన డ్రీమ్ రోల్ పవర్ ఫుల్ పోలీస్ అని తెలుస్తుంది. నిజానికి పోలీస్ పాత్రలు అంటే కింగ్ నాగార్జునకు ఎంత ఇష్టమో.. “శివమణి” సినిమాతోనే తెలుస్తుంది. ఈ సినిమా ఆ కాలంలో బ్లాక్ బస్టర్ హిట్. మళ్లీ అలాంటి బ్లాక్ బస్టర్ పోలీస్ స్టోరీతో రావాలని నాగ్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. 2018 లో నమ్మకం లేని ప్లాప్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తో “ఆఫీసర్” అనే సినిమా చేశాడు. అలాగే అహిషోర్‌ సాల్మన్‌ అనే ఓ కొత్త దర్శకుడితో “వైల్డ్ డాగ్” అనే సూపర్ కాప్ మూవీ చేశాడు.

ఇప్పుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో “ది ఘోస్ట్” అనే సినిమా చేశాడు. ఈ మూడు సినిమాలకు చాలా కామన్ పాయింట్స్ ఉన్నాయి. “ఆఫీసర్” “వైల్డ్ డాగ్” “ది ఘోస్ట్” సినిమాల టీజర్లు, ఫస్ట్ లుక్ పోస్టర్లు, ట్రైలర్లు అద్భుతంగా ఉన్నాయి. సినిమాలో ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉన్నాయనే క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి. బజ్ నూ క్రియేట్ చేశాయి. కానీ ఈ మూడు సినిమాలు కూడా ప్రేక్షకులను నిరాశపరిచాయి. ఇంకా కాస్త లోతుగా చూస్తే.. ఒకే గెటప్ తో మూడు డిఫరెంట్ సినిమాలు చేసినట్లు ఫీలింగ్ వస్తుంది.

- Advertisement -

నిజానికి.. “ఆఫీసర్” “వైల్డ్ డాగ్” సినిమాలు ప్లాప్ అయినప్పుడు ప్రేక్షకులు తన నుంచి ఇలాంటి సినిమాలను యాక్సెప్ట్ చేయడం లేదని నాగ్ తెలుసుకోవాల్సింది. అలా తెలుసుకోకుండా.. ప్రేక్షకులపై పగ పట్టినట్టు వరుసగా అదే తరహా సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులపై రుద్దుతున్నాడు అంటూ విమర్శలు వస్తున్నాయి. మళ్లీ ఇలాంటి రోల్ తో.. కథతో.. వస్తాడని ప్రేక్షకులకు భయం లేకపోలేదు. ఎందుకంటే.. ఆయన నుంచి వస్తున్న సినిమాలు అలాగే ఉన్నాయి. “పిచ్చి ఉండాలి భయ్యా.. మరీ ప్రేక్షకులు తిరస్కరిస్తున్నా.. మళ్లీ మళ్లీ అదే గెటప్ తో వచ్చేంత పిచ్చి ఉండకూడదు” అంటూ ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు