Samantha : హాలీవుడ్ రేంజ్‌లో..

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం “యశోద”. హరి, హరీష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నవంబర్ 11న ఐదు భాషలలో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. వినూత్నమైన కథతో రూపొందిన సీట్ ఎడ్జ్ త్రిల్లర్ యశోద. టైటిల్ పాత్రలో సమంత అద్భుతంగా నటించారు.

ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలకపాత్రలు పోషిస్తూ ఉండగా.. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక‌ల‌ కృష్ణ ప్రసాద్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇటీవల విడుదలైన టీజర్ తో యశోద మూవీపై ఆసక్తి నెలకొంది.

ఈ టీజర్ లో సమంత ప్రెగ్నెంట్ మహిళగా కనిపించడం.. గాయాలతో సస్పెన్స్ థ్రిల్లర్ గా టీజర్ రిలీజ్ చేయడంతో మూవీపై మరింత హైప్ క్రియేట్ అయింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలోని పలు యాక్షన్ సన్నివేశాల కోసం సమంత అసలు వెనుకడుగు వేయలేదట. యాక్షన్స్ సన్నివేశాల కోసం మూవీ యూనిట్ హాలీవుడ్ స్టంట్ మ్యాన్ తో సమంతకు శిక్షణ ఇప్పించారట. ” ది ఫ్యామిలీ మ్యాన్ 2″ కోసం పనిచేసిన యూనిక్ బెన్ ఆధ్వర్యంలో యశోద చిత్రానికి సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ లను తెరకెక్కించారని సమాచారం. ఇక ప్రస్తుతం సమంత ‘ఖుషి’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు