Samantha : మరో ఐటెం సాంగ్ కు సై ?

సమంత నటనకు ఎంతో మంది అభిమానులు ఉంటారు. ఆమె నటించిన సినిమాలు చాలా వరకు హిట్ అయ్యాయి. కొన్ని మాత్రమే ప్లాఫ్ టాక్ తెచ్చుకున్నాయి. సీనియర్ హీరోయిన్లకు అవకాశాలు తగ్గుతున్నా సమంతకు మాత్రం రోజు రోజుకు కొత్త అవకాశాలు వస్తున్నాయి. సామ్ ప్రస్తుతం ’శాకుంతలం‘ ’యశోద‘ అనే రెండు లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది.

ఇందులో యశోద పాన్ ఇండియా సినిమా. సామ్ కెరీర్ లో తొలి పాన్ ఇండియా సినిమా యశోద. ఈ సినిమా షూటింగ్ ఒక పాట మినహా మొత్తం పూర్తి అయిందని ఇటీవలే నిర్మతలు ప్రకటించారు. ఆ పాటకు కూడా త్వరలోనే చిత్రీకరిస్తామని వెల్లడించారు.

తాజా గా ఈ పాట షూటింగ్ ప్రారంభమైంది. హైదరాబాద్ లో ఈ పాట కోసం ప్రత్యేక సెట్ వేశారని సమాచారం. మణిశర్మ అందించిన ఓ మాస్ సాంగ్ కు సామ్ చిందేస్తుందట. సమంత కెరీర్ లో ’ఊ అంటావా మామ..‘ అనే సాంగ్ కు ఎంత క్రేజ్ వచ్చిందో అందరికీ తెలుసు. ఈ పాటకు మించిన మాస్ స్టెప్స్, యశోద సాంగ్ లో ఉంటాయని తెలుస్తోంది. మొత్తంగా యశోద సినిమాలో సమంత మాస్ ఐటెం సాంగ్ టాప్ లేచిపోయేలా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది.

- Advertisement -

ఈ ఐటెం సాంగ్ కు హిట్ అయితే సమంత క్రేజ్ మరింత పెరగడం ఖాయం. ఇప్పటికే ఈ భామ బాలీవుడ్ అవకాశాలతో ఫుల్ బిజీ గా ఉంది. ఈ పాట తర్వాత మరింత బిజీ గా ఉంటుందని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు