Anil Ravipudi : ’రవితేజతో మరో సినిమా చేస్తా‘

మాస్ హీరో రవితేజ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్నాడు. టైగర్ నాగేశ్వర రావు, ధమాకా, రావణాసుర తో పాటు మెగా 154 సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. వీటితో పాటు రామారావు ఆన్ డ్యూటీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా జులై 29న థియేటర్ లలో విడుదల కానుంది. శనివారం సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ సందడి చేసింది.

ట్రైలర్ లాంచ్ చిత్ర బృందం ఓ ఈవెంట్ ను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ కు ఆరుగురు దర్శకులు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో అనిల్ రావిపూడి ఒక్కడు. ఎఫ్ 3 సినిమా విజయంతో ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు అనిల్. అలాగే తన తర్వాత సినిమా బాలయ్య తో చేయబోతున్నాడు. బాలయ్య తో సినిమా అంటే, మినిమం హిట్ గ్యారంటీ ఉంటుంది.

ఇవన్ని పక్కన పెడితే, రామారావు ఆన్ డ్యూటీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అనిల్ రావిపూడి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అవి ఏంటంటే, రవితేజ తో మరో సినిమా చేస్తా అని చెప్పాడు. తమ కాంబో లో మరో సినిమా తప్పక ఉంటుందని స్పష్టం చేశాడు.

- Advertisement -

కొద్ది రోజుల క్రితం రవితేజతో సినిమా గురించి అనిల్ రావిపూడి కీలక వ్యాఖ్యలు చేశాడు. రవితేజతో రాజా ది గ్రేట్ 2 చేస్తానని చెప్పాడు. అది అప్పుడో టైం చెప్పలేదు కానీ, సీక్వెల్ మాత్రం ఉంటుందని చెప్పాడు. తాజా గా ఇప్పుడు రామారావు ఈవెంట్ లో కూడా తమ కాంబోలో సినిమా అని చెప్పడంతో రాజా ది గ్రేట్ సీక్వెల్ ఉంటుందని తెలిసిపోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు