Samantha : టార్గెట్ బాలీవుడ్ ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఎంత బిజీ గా ఉందో అందరికీ తెలుసు. వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, వేగంగా షూటింగ్ లను కూడా పూర్తి చేస్తుంది. సమంత ప్రస్తుతం శాకుంతలం, యశోద తో పాటు విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా చేస్తుంది. ఈ మూడు సినిమాలు కూడా తెలుగు భాషకు చెందినవి. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ కాబట్టి సమంతకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి.

బాలీవుడ్ లో సమంత ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. అయినా అక్కడ సినిమా అవకాశాలు వస్తున్నాయట. ఇప్పటికే ముగ్గురు నిర్మాతలతో సమంత చర్చలు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందులో ఒకటి బాలీవుడ్ కుర్ర హీరో ఆయుష్మన్ ఖూరనాతో అని గత కొద్ది రోజుల నుండి బాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది.

సమంత నిజంగానే బాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తే, అక్కడ కూడా స్టార్ హీరోయిన్ అయిపోవడం గ్యారంటీ. ఇప్పుడు చర్చలు జరుపుతున్న మూడు సినిమాలు ఒకే అయితే, సమంత బాలీవుడ్ బ్యూటీ అయిపోతుంది. సమంత ఇప్పటికే ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ తో హిందీ ప్రేక్షకలకు పరిచయం అయింది. దీంతో తన సినిమాలతో హిందీ ప్రేక్షకులను ఆకట్టుకోవడం సమంతకు పెద్ద పని ఏం కాదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు