Rama Rao On Duty Trailer : ధర్మం కోసం రామరావు

మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న తాజా సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’. కొత్త దర్శకుడు శరత్ మండవ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 29న థియేటర్లలో విడుదల కానుంది. దీని కోసం ఇప్పటికే ప్రమోషన్లను చిత్ర బృందం ప్రారంభించింది. అందులో భాగంగా శనివారం సాయంత్రం సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.

2:16 నిమిషాలు ఉన్న ఈ ట్రైలర్ లో యాక్షన్, ఎమోషన్, లవ్, రొమాన్స్ అన్ని సమపాలాల్లో ఉండేలా దర్శకుడు చూసుకున్నాడు. ట్రైలర్ ప్రకారం ఈ సినిమా మిస్సింగ్ కేసులను ఛేదించేలా ఉన్నట్టు తెలుస్తుంది. తప్పిపోయిన కష్ట జీవుల కోసం ఒక ప్రభుత్వ అధికారి ఏం చేశాడు అన్నది సినిమా అని ట్రైలర్ తో అర్థమవుతుంది. అలాగే ‘ఇన్నాళ్లు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గా చట్టప్రకారం డ్యూటీ చేసిన నేను, ఇకపై రామారావుగా ధర్మం కోసం డ్యూటీ చేస్తాను’ అని రవితేజ చెప్పిన డైలాగ్ ఉంటుంది. ఈ ఒక్క డైలాగ్ తోనే సినిమా కథ అర్థమవుతుంది. హీరో ధర్మం కోసం చట్టాన్ని పక్కన పెడతాడని తెలిసిపోతుంది.

రవితేజ మార్క్ యాక్షన్ సీన్స్ ఉన్నాయి. అలాగే ఇద్దరు హీరోయిన్స్ తో రవితేజ రొమాన్స్ సన్నివేశాలు ఉన్నాయి. అలాగే ఓ లిప్ లాక్ సీన్ కూడా ట్రైలర్ లో ఉంది. దీన్ని బట్టి రామరావు ఆన్ డ్యూటీలో యాక్షన్ సన్నీవేశాలకు ధీటుగా రొమాన్స్ కూడా ఉన్నట్టు అర్థమవుతుంది.

- Advertisement -

అలాగే ఈ సినిమాలో వేణు తొట్టంపూడి పాత్ర చాలా కీలకమైందని ట్రైలర్ తో తెలిసిపోతుంది. వేణు నటన కూడా బాగుంది. ఈ సినిమా హిట్ అయితే, వేణు రీ ఎంట్రీ అదిరిపోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు