RC15 : ఫ్లాప్ సెంటిమెంట్ భయం

ఇప్పుడున్న టాలీవుడ్ వేరు. గతంలో ఉన్న టాలవుడ్ వేరు. అప్పట్లో టాలీవుడ్ అనేది చిన్న సినీ పరిశ్రమ. కానీ, ప్రస్తుతం టాలీవుడ్ అంటే, బాలీవుడ్ ను తలదన్నే పెద్ద ఇండస్ట్రీ. ఇక్కడి హీరోలు వరుసగా పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ ను సొంతం చేసుకుంటున్నారు. తెలుగు సినిమాలు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. దీంతో అందరి కళ్లు టాలీవుడ్ పై పడ్డాయి.

తెలుగు స్టార్ హీరోలతో సినిమాలు చేసి, పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని ఇతర భాషల డైరెక్టర్లు భావించారు. ముందుగా కోలీవుడ్ డైరెక్టర్లు తెలుగు హీరోలతో సినిమాలు చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్రముఖ తమిళ దర్శకుడు మురగదాస్ స్పైడర్ అనే సినిమా చేశాడు. సినిమా అనౌన్స్ చేసిన నాటి నుండి విడుదల వరకు భారీ అంచనాలు ఉన్నాయి.

కానీ, విడుదల తర్వాత అంచనాలను అందుకోలేక, డిజాస్టార్ గా మిగిలిపోయింది. అలాగే విజయ్ దేవరకొండతో తమిళ దర్శకుడు స్టైయిట్ తెలుగు సినిమా నోటా చేసారు. ఈ సినిమాకు ముందు అర్జున్ రెడ్డి, గీతా గోవిందం హిట్స్ ఫుల్ ఫాంలో ఉన్నాడు. కానీ, ఈ ఫాం నోటా సినిమాకు పని చేయలేదు. ఈ సినిమా ఇటు తెలుగులో, అటు తమిళంలో దారుణంగా డిజాస్టర్ అయింది.

- Advertisement -

తాజా గా కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి టాలీవుడ్ స్టార్ రామ్ తో ది వారియర్ చేసారు. ఈ సినిమాకు కూడా అనౌన్స్ మెంట్ నుండి విడుదల వరకు భారీ అంచనాలు ఉన్నాయి. కానీ, ఈ సినిమా కూడా కలెక్షన్స్ పరంగా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అని తేలింది.
ఈ సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోవడానికి కారణం ఉంది. తమిళ దర్శకులు తెలుగు నేటివిటిని సినిమాలో చూపించడంలో విఫలమవుతున్నారు అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే తెలుగు ప్రేక్షకులకు తమిళ దర్శకుల ఆలోచన కూడా నచ్చడం లేదని తెలిసిపోతుంది.

అయితే, ఇప్పుడు ఈ భయం మెగా ఫ్యాన్స్ కు పట్టుకుంది. ఎందుకంటే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ తో RC15 అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా 50 శాతం షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. అయితే, ఈ చిత్రం కూడా ఎప్పటి లాగే, తమిళ దర్శకుల సినిమాల్లా ఫ్లాప్ అవుతుందా అని మెగా ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారట.

అలాగే, రామ్ చరణ్ ఈ ఫ్లాప్ సెంటిమెంట్ ను బీట్ చేస్తాడని కూడా కొంత మంది మెగా ఫ్యాన్స్ అంటున్నారు. శంకర్ పై నమ్మకం ఉంది అని చెబుతున్నారు. రామ్ చరణ్ బలి అయిపోతాడా. లేదా, సెంటి మెంట్ ను బ్రేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొడుతాడా అనేది చూడాలి మరీ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు