BalaKrishna : రెమ్యునరేషన్ అన్ స్టాపబుల్ ?

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో బాలయ్యకు ఉన్న మాస్ ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. 60 ఏళ్ళ వయసులో కూడా తన జోష్ కొనసాగిస్తున్నాడు. అఖండతో భారీ విజయాన్ని దక్కించుకున్నాడు. “అన్ స్టాపబుల్” విత్ ఎన్.బి.కె షోకి వ్యాఖ్యాతగా చేస్తూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఎప్పుడూ సీరియస్ గా కనిపించే బాలయ్య అన్ స్టాపబుల్ షోలో మాత్రం చాలా సరదాగా సెలబ్రిటీలను ఆటపట్టిస్తూ ఉంటాడు. అయితే ఈ షోకు బాలకృష్ణ తీసుకునే రెమ్యూనరేషన్ పై అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ షోకి నటసింహం ఒక్కో ఎపిసోడ్ కు సుమారు 40 లక్షల పారితోషికం తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.

వచ్చే సీజన్ కి బాలకృష్ణ రెమ్యూనరేషన్ కూడా డబుల్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అఖండ విజయం తర్వాత నటసింహం తన రెమ్యునరేషన్ ని అమాంతం పెంచేశారని చిత్ర పరిశ్రమలో వార్తలు వినిపిస్తున్నాయి. అఖండకు 10 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారని సమాచారం. అనిల్ రావిపూడి తో చేస్తున్న సినిమాకు దాదాపు 15 కోట్లు డిమాండ్ చేసినట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

ఒక సినిమా మంచి విజయం అందుకోవడంతో హీరోలు రెమ్యునరేషన్ భారీగా పెంచేస్తున్నారు. యువ హీరోల నుంచి స్టార్ల వరకు 10 కోట్ల నుంచి 70 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఎంటంటే, ఈ మధ్య బాలకృష్ణ నటించిన చిత్రాలలో బోయపాటి దర్శకత్వం వహించిన సినిమాలు మినహా, మిగితా సినిమాలు ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు