Kushi: ఊహించని రోల్ లో సమంత

టాలీవుడ్ బ్యూటీ సమంత డిఫరెంట్ గా ముందుకెళ్తుంది. కెరీర్ బిగినింగ్ నుంచి గ్లామర్ రోల్స్ కే పరిమితం కాకుండా అప్పుడప్పుడు నటనకు స్కోప్ ఉన్న చిత్రాలు చేస్తూ తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ గా శాకుంతలం సినిమా తో మెయిన్ లీడ్ గా “శకుంతల” గా ప్రేక్షకులను పలకరించింది. మైథలాజికల్ మూవీ గా వచ్చిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయినా జయాపజయాలను పట్టించుకోని సమంత తన తదుపరి ప్రాజెక్ట్స్ తో బిజీ గా ఉంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో “ఖుషి” అనే సినిమా చేస్తుంది సామ్.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి వచ్చింది. ఖుషి సినిమాలోని ఫస్ట్ సింగిల్ యొక్క ప్రోమో వచ్చింది. “నా రోజా నువ్వే” అంటూ సాగే లిరికల్ సాంగ్ ని మే9 న విడుదల చేస్తున్నామని ఈ ప్రోమో ద్వారా ప్రకటించారు. అయితే ఈ ప్రోమో ద్వారా సమంత ఊహించలేని పాత్ర చేస్తుందని తెలిసింది. ఈ సినిమా లో సమంత టైటిల్ రోల్ ని చేస్తుండగా విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడని తెలిసిందే.

సమంత ఈ సినిమాలో ఒక ముస్లిం యువతిగా కనిపిస్తుందని తాజాగా రిలీజ్ అయిన ప్రోమో ద్వారా తెలిసింది. ఈ ప్రోమోలో సమంత నమాజ్ చేస్తున్నట్టుగా చూపించారు. అయితే సమంత ఇప్పటివరకు ఏ సినిమాలోనూ ముస్లిం యువతిగా నటించలేదు. తన తొలి సినిమా “ఏ మాయ చేసావే” లో క్రిస్టియన్ గా నటించింది. మరి “ఖుషి” సినిమాలో సమంత పాత్ర ఏ విధంగా మలచబడిందో తెలియాలి. ఈ మూవీని 2023 సెప్టెంబర్ 1న విడుదల చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు