Atlee : జవాన్ మరో పఠాన్ అవుతుందా..సలార్ వస్తే పరిస్థితి ఏంటి ?

గత కొన్ని సంవత్సరాలుగా సరైన హిట్ లేని షారుఖ్ ఖాన్ పఠాన్ తో సాలిడ్ హిట్ అందుకున్నాడు. అయితే పఠాన్ సినిమా ఒక్క షారుఖ్ ఖాన్ కి మాత్రమే కాదు, రీమేక్ లలో కూరుకుపోయిన బాలీవుడ్ కి కూడా బ్రేక్ ఇచ్చింది. ఐతే రీమేక్ చేయాలి లేకపోతే గతంలో సూపర్ హిట్ అయిన సినిమాని రీమిక్స్ చేయాలి అనే పంథాలో కొనసాగుతున్న బాలీవుడ్ తీరుకి షారుఖ్ పఠాన్ సినిమానే సమాధానం చెప్పింది.

తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని హిందీతో పాటు అన్ని సౌత్ ఇండియన్ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. అట్లీ తమిళ్ లో తలపతి విజయ్ తో బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్ సినిమాలకి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాలు హిందీలో కూడా డబ్ అయి మంచి రెస్పాన్స్ రావడంతో షారుఖ్, అట్లీతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు . షారుఖ్ లాంటి హీరో అవకాశం ఇవ్వగానే అట్లీ వెంటనే స్క్రిప్ట్ రెడీ చేసి, జవాన్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాడు.

ప్రస్తుతం జవాన్ షూటింగ్ తుది దశకి చేరుకుంది. అయితే పఠాన్ సినిమా రిలీజ్ ఉండటం వల్ల కొద్దీ రోజులు జవాన్ షూటింగ్ హోల్డ్ లో పడిపోయింది. అయితే లేటెస్ట్ గా జవాన్ సినిమాకి సంబందించి రిలీజ్ డేట్ ని శనివారం రోజున మూవీ యూనిట్ అఫిషల్ గా ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 7న మూవీని రిలీజ్ చేయబోతున్నరంటు మూవీ టీం ఎనౌన్స్ చేసింది. అయితే ప్రభాస్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తోన్న సలార్ సినిమా కూడా సెప్టెంబర్ లోనే రాబోతుంది. ప్రశాంత్ నీల్ సలార్ సినిమాని, కేజిఎఫ్ సినిమా కంటే గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందుకే ఏ సినిమా పోటీ ఉండకూడదనే ఉదేశ్యంతోనే, సలార్ రిలీజ్ డేట్ ని ప్రశాంత్ నీల్ ముందుగానే ప్రకటించాడు. అయితే ఇప్పుడు సడెన్ గా జవాన్ సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసేసరికి, ఇండస్ట్రీ లో చర్చలకు దారి తీస్తుంది, రిలీజ్ పరంగా చూస్తే రెండు సినిమాలకి మధ్య 3వారాల వ్యత్యాసం ఉంది. దీనివల్ల ఏ సినిమాకి కూడా పెద్ద ఎఫెక్ట్ ఐతే ఉండదు కానీ లాంగ్ రన్ లో మాత్రం ఈ రెండు సినిమాలకి క్లాష్ అయితే వస్తుంది. ఈ క్లాష్ రాకుండా ఉండాలంటే రెండు సినిమాల్లో ఎదో ఒక సినిమా పోస్ట్ పోన్ చేయాల్సి వస్తుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు