Spy: నిఖిల్ మూవీ రిలీజ్ అప్డేట్.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు

టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “స్పై”. గ్యారీ బీహెచ్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాను “ఈడీ ఎంటర్టైన్మెంట్స్” బ్యానర్ లో కే. రాజేశ్వర రెడ్డి నిర్మిస్తున్నాడు. శ్రీ చరణ్ పాకాల ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇక ఈ మూవీలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఎప్పుడో 2021 లో అనౌన్స్ అయిన స్పై సినిమా 2022 లో స్టార్ట్ అయింది. 2022లో దసరా కానుక గా విడుదల కావాల్సి ఉండగా ఎన్నో అవాంతరాలతో పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది.

మొదట నిఖిల్ స్పై మూవీ రిలీజ్ దగ్గర పడుతున్న సమయంలో కార్తికేయ2 ప్రమోషన్స్ తో బిజీ అయ్యాడు. దాంతో స్పై సినిమా షూట్ ఆలస్యమయింది. ఆ తరవాత కార్తికేయ2 బ్లాక్ బస్టర్ విజయంతో ఈ మూవీని కూడా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చెయ్యాలని స్క్రిప్ట్ లో పలు మార్పులు చేసారు. అందువల్ల స్పై చిత్ర షూటింగ్ మరింత ఆలస్యమయింది. ఈ గ్యాప్ లో నిఖిల్ 18 పేజెస్ మూవీని కూడా కంప్లీట్ చేసాడు. 2022 క్రిస్మస్ కానుకగా విడుదలైన ఆ సినిమా యావరేజ్ గా ఆడింది.

ఈ సినిమాల తర్వాత స్పై సినిమా పై నిఖిల్ పూర్తి శ్రద్ధ పెట్టాడు. ఇప్పటికే 80 శాతం కంప్లీట్ షూటింగ్ అయిపోగా తాజాగా ఈ చిత్ర రిలీజ్ అప్డేట్ ని, అలాగే టీజర్ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేసారు చిత్ర యూనిట్. “స్పై” మూవీని జూన్ 29 వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్టు మోషన్ టీజర్ ద్వారా ప్రకటించగా, అలాగే అందులో “స్పై” యొక్క అఫిషియల్ టీజర్ ని మే12 న విడుదల చేస్తున్నామని ప్రకటించారు. ఇప్పటివరకు వచ్చిన స్పై జోనర్ మూవీస్ లో అన్నిటికన్నా డిఫరెంట్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ఎలాంటి నేపథ్యంతో వస్తుందో తెలియాలంటే టీజర్ వచ్చే వరకు ఆగాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు