Movies: మే 12న ఐదు సినిమాలు. వీటిలో ఏది మెప్పిస్తుంది?

టాలీవుడ్ మే నెలను డిజాస్టర్ మూవీతో ఆరంభించింది. మే 5న మంచి అంచనాలతో విడుదలైన రామబాణం మూవీ డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. కనీస వసూళ్లు, కల్లెక్షన్స్ లేక థియేటర్లు ఖాళీ అవుతున్నాయి. దీనితో పాటే రిలీజ్ అయిన ఉగ్రం యావరేజ్ టాక్ తో కొంచెం బెటర్ గా రన్ అవుతున్నా ఆ చిత్రానికి ఎక్కువగా ప్రమోట్ కాకపోవడంతో హౌస్ ఫుల్స్ కావట్లేదు. వీటికంటే రెండు వారాల ముందు విడుదలైన విరూపాక్ష ఇంకా కొన్ని థియేటర్లలో బాగా ఆడుతుంది.

ఇప్పుడు మే రెండో వారంలో అనగా మే12 న ఐదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆ సినిమాల గురించి ఒక్కసారి గమనిస్తే ముందుగా మంచి క్రేజ్ తో ఇప్పటికే అంచనాలు పెంచేసిన కస్టడీ మూవీ ఒకటి. ఈ సినిమా లో అక్కినేని నాగచైతన్య హీరోగా నటించగా, కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ మూవీపై ఉన్న అంచనాలను విపరీతంగా పెంచేసింది. కస్టడీ మూవీలో నాగ చైతన్య ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఈ వారం విడుదలయ్యే సినిమాల్లో భారీ అంచనాలున్న మూవీ ఇదే.

ఇక మిగతావన్ని చిన్న సినిమాలుగా వస్తున్నాయి. మే 12న సునీల్ హీరోగా నటించిన “భువన విజయం” అనే కామెడీ డ్రామా విడుదల అవుతుంది. అయితే ఈ సినిమాకి ప్రమోషన్ ఎక్కువగా చేయకపోవడం వల్ల బాక్స్ ఆఫీస్ వద్ద ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. ఇక ఆ తరువాత శ్రియ శరన్ మెయిన్ లీడ్ గా నటించిన “మ్యూజిక్ స్కూల్” విడుదల అవుతుంది. మే6 న జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా జరుపుకున్న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ్ లో కూడా విడుదలవుతుంది. ఇక మరో చిన్న సినిమా ‘ది స్టోరీ ఆఫ్ బ్యూటీఫుల్ గర్ల్’ అనే మూవీ కూడా వస్తుంది.

- Advertisement -

ఈ సినిమాలన్నీ కాకుండా హిందీలో తెలుగు హీరో అయిన బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ఛత్రపతి మూవీ విడుదల అవుతుంది. ఈ సినిమా ప్రభాస్ నటించిన ఛత్రపతికి రీమేక్. అయితే పేరుకి హిందీ సినిమా అయినా తెలుగు హీరో అవడంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా చూసే అవకాశం ఉంది. మరి మే 12 న విడుదలవుతున్న ఈ మూవీస్ లో ఏది మెప్పిస్తుందో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు