Naga chaithanya: కస్టడీ సినిమా కోసం కృతి శెట్టి పడ్డ కష్టం చూస్తే వావ్ అనాల్సిందే

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన ఉప్పెన సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన బుచ్చి బాబు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. మైత్రి మూవీస్ బ్యానర్ లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచి, దాదాపు 100 కోట్ల వసూళ్ళని రాబట్టింది.

మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ చూసిన కృతి, వైష్ణవ్ ల పెయిర్ కి మంచి క్రేజ్ వచ్చింది. ఉప్పెన సినిమా ఇచ్చిన సక్సెస్ తో కృతి వరుస సినిమాలతో తెలుగులో బిజీ హీరోయిన్ మారింది. కానీ బెబమ్మకి ఉప్పెన మినహా ఆ రేంజ్ సక్సెస్ మాత్రం ఏ సినిమా ఇవ్వలేకపోయింది. దాదాపు అందరు యంగ్ హీరోలతో పని చేసే అవకాశం వచ్చిన కూడా ఆశించినంత విజయం మాత్రం ఏ సినిమా ఇవ్వలేదు. దాంతో కృతి కి అవకాశాలు కరువయ్యాయి.

ప్రస్తుతం కృతి నాగ చైతన్య హీరోగా వస్తోన్న కస్టడీ సినిమాలో నటిస్తోంది. తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 12న విడుదలకి సిద్ధమవుతోంది. ఈ సందర్బంగా ఈ సినిమా ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసారు మూవీ యూనిట్. అయితే తెలుగు, తమిళ్ బై లాంగ్వేజికల్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాకి కృతి, నాగ చైతన్య చాలా కష్టపడ్డారంట. ఈ సినిమా 90’స్ లో జరిగే కథగా ఉండబోతుందంట.

- Advertisement -

ఉప్పెన సినిమాలో కృతి శెట్టి క్యారెక్టర్ ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో అందరికి తెలిసిందే. అయితే అదే తరహాలో కస్టడీలో కూడా కృతి క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా ఉండబోతుందంట. కృతి ఈ సినిమా కోసం తన క్యారెక్టర్ ని ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోడానికి, రోజు సెట్ కి ఒక బుక్ తీసుకొని వచ్చి, సినిమాలో జరిగే ఈవెంట్స్ ని బైహర్డ్ చేసుకునేదంట కృతి. కానీ నాగ చైతన్య ఇలాంటివేం పట్టించుకోకుండా సెట్ కి వచ్చే వాడంట. చై ని కృతి కుర్చోబెట్టుకొని మరీ క్యారెక్టర్ గురించి, అంతకు ముందు జరిగిన బ్యాక్ స్టోరీని వివరించేది అంట.

హీరోయిన్ గా ఛాన్స్ దొరికిందంటే లగ్జరి లైఫ్ దొరికిందనుకొని ఎంజాయ్ చేసే హీరోయిన్స్ ఉన్న తెలుగు పరిశ్రమలో కృతి శెట్టి ఇంత డేడికేటెడ్ గా వర్క్ చేస్తుందంటే, యాక్టింగ్ పట్ల తనకి ఎంత బాధ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు