Chiranjeevi: మెగాస్టార్ కి కార్ల పిచ్చి ఉండడానికి ఆ హీరోయిన్ చేసిన అవమానమే కారణమా..?

సినీ సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్స్ లో చాలామంది ఎప్పటికప్పుడు కొత్త కార్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. మార్కెట్లోకి కొత్త కారు వచ్చిందంటే చాలు వెంటనే కోట్ల రూపాయలను వెచ్చించి కొనేందుకు సెలబ్రిటీలు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అంతేకాదు దానికి ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నెంబర్ పొందేందుకు కూడా లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు. ఫిలిం స్టార్లకు సంబంధించి ఇలాంటి వార్తలు గతంలో చాలా చూశాం. మెగాస్టార్ చిరంజీవికి సైతం కార్లు అంటే చాలా ఇష్టం.

మార్కెట్లోకి ఏ కొత్త టెక్నాలజీ కారు వచ్చినా తన ఇంటి ముందు ఉండాల్సిందే. అయితే చిరంజీవికి కార్లు అంటే అంత ఇష్టం ఉండడానికి ప్రధాన కారణం ఓ హీరోయిన్ ఆట. ఆ హీరోయిన్ చిరంజీవిని అవమానించడం వల్లే కార్లు అంటే ఎంత ఇష్టంగా మార్చుకున్నారట చిరంజీవి. ఆయన ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న సమయంలో నటి మాధవితో కలిసి ఖైదీ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమా అవుట్ డోర్ షూటింగ్ సమయంలో ఒకరోజు చిరంజీవి కోసం కారు రాలేదట. దీంతో హోటల్లో హీరోయిన్ కూడా ఉండడంతో ఇద్దరికీ కలిపి ఒకే కారు పంపించారట. అప్పటికే కారు కోసం ఎదురుచూస్తున్న చిరంజీవి ఈ కారు రావడంతో మాధవితో కలిసి వెనుక సీట్లో కూర్చున్నారట. అప్పటికే మాధవి స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో కొనసాగుతూ భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. అయితే చిరంజీవి వెనక్కి వెళ్లి ఆమె సీట్లో కూర్చోవడంతో.. ‘ఇది నా కోసమే ఏర్పాటు చేసిన కారు. మీరు వెళ్లి ముందు కూర్చుండి. ఇలా నా పక్కన కూర్చోవడానికి వీలు లేదు’ అని మాధవి అనడంతో.. ఆమెకి సారీ చెప్పిన చిరంజీవి ముందుకు వెళ్లి కూర్చున్నారట. అలా ఆరోజు ఆ హీరోయిన్ చేసిన అవమానమే చివరంజీవి కి కారు అంటే ఇష్టం వచ్చేలా చేసిందని.. అందుకే కొత్త కార్లను కొనేందుకు చిరంజీవి ఆసక్తి చూపిస్తూ ఉంటారని తెలుస్తోంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు