Samantha : ట్రాక్ మార్చిందా ?

సమంత.. ఈ పేరుకు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో మాత్రమే కాదు తమిళం, హిందీ లో కూడా సామ్ కు సూపర్ క్రేజ్ ఉంది. ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తర్వాత ఆగ్ర హీరోల సరసన వరుసగా సినిమాలు చేసి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సమంతా లైఫ్ ను పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత అంటూ పోల్చి చూడొచ్చు.

సాధారణంగానే పెళ్లిళ్లు అయ్యాక హీరోయిన్లకు సినిమా అవకాశాలు అంతగా రావు. కానీ, నాగ చైతన్యతో పెళ్లి అయినప్పుడు గానీ, తర్వాత విడిపోయినప్పుడు గానీ సామ్ కు అవకాశాలు తగ్గలేదు. నిజానికి అంతకు మించిన ఛాన్స్ లు, అంతకు మించిన పాపులారిటీ వచ్చింది. పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించి ఒక్కసారిగా ఇండస్ట్రీని తన వైపు తిప్పుకుంది. అప్పటివరకు ఆచితూచి సినిమాలు చేస్తూ వచ్చిన సామ్.. గ్లామర్ షోకు కూడా అడ్డు చెప్పకపోవడంతో ఈ స్టార్ హీరోయిన్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు.

అయితే తాజాగా సమంత ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి రొమాంటిక్ క్యారెక్టర్స్ చేయకూడదని నిర్ణయించుకుందట. కేవలం యాక్షన్ పాత్రలు మాత్రమే చేస్తూ కెరీర్ లో ముందుకు వెళ్లాలని డిసైడ్ అయినట్లు సమాచారం. కథ బాగా నచ్చినప్పుడు కచ్చితంగా రొమాంటిక్ యాంగిల్ చూపించవచ్చు. కానీ ప్రతి సినిమాలో గ్లామర్ గా కనిపించాలి అంటే మాత్రం కుదరదని నిర్మాతలకు ఖరాకండిగా చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. మరి సమంత తీసుకున్న ఈ నిర్ణయం కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపుతోందో వేచి చూడాలి. కాగా సమంత ఇప్పటికే సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. తాజాగా గ్లామర్ షోకు కూడా దూరం ఉంటానని నిర్ణయం తీసుకోవడంతో సమంత తన కెరీర్ ట్రాక్ ను మార్చుతుంది అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు