Salaar 2 Movie: “సలార్ 2” అప్డేట్ పై హింట్ ఇచ్చిన తమిళ స్టార్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన “సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్” బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. 2023 డిసెంబర్ 22న రిలీజ్ అయిన ఈ మూవీతోనే ప్రభాస్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. పాన్ ఇండియా వైడ్ భారీ కలెక్షన్స్ లో కొల్లగొట్టిన ఈ మూవీకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన “సలార్” 750 కోట్ల కలెక్షన్స్ రాబట్టి మరోసారి పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ సత్తా ఏంటో ప్రూవ్ చేసింది. అలాగే పార్ట్ 2 కూడా ఉండబోతోంది అంటూ థియేటర్లలోనే అనౌన్స్ చేశారు మేకర్స్. దీంతో “సలార్ పార్ట్ 2” ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని ప్రభాస్ అభిమానులంతా అప్పటి నుంచే వెయిట్ చేయడం మొదలు పెట్టారు. తాజాగా సీక్వెల్ షూటింగ్ గురించి క్రేజీ అప్డేట్ ను తమిళ స్టార్ బయట పెట్టాడు.

“శౌర్యంగ పర్వం”లోనే సమాధానాలన్నీ…
సలార్ సెకండ్ పార్ట్ కు “శౌర్యంగ పర్వం” అనే టైటిల్ ను ఇప్పటికే ఖరారు చేశారు చిత్ర బృందం. అందులో శౌర్యంగ తానేనని దేవ (ప్రభాస్)కు అసలు తెలుసా లేదా? అనే అతిపెద్ద ప్రశ్నను ప్రేక్షకులకు కలిగించాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. మరోవైపు ఆ కుర్చీ స్నేహితుడిదేనని వరదరాజ మన్నార్ కు ఇచ్చిన మాటను దేవ ఎలా నిలబెట్టుకుంటాడు? అనే క్యూరియాసిటీ కూడా ఆడియన్స్ లో క్రియేట్ అయ్యింది. అంతేకాకుండా ప్రాణ స్నేహితులైన దేవా, వరదరాజ మన్నార్ మధ్య జరగనున్న అతిపెద్ద యుద్ధం కూడా రెండో భాగంలోనే ఉండబోతుందని మేకర్స్ హింట్ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలోనే “సలార్ 2” అప్డేట్ గురించి సినీ ప్రియులంతా ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. తాజాగా తమిళ నటుడు బాబి సింహ ఈ సినిమా గురించిన కీలక అప్డేట్ ను బయటపెట్టారు.

"Salaar 2" Update given by Bobby Simha

- Advertisement -

“సలార్ 2” అప్డేట్ ఇచ్చిన బాబీ సింహ
తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో తమిళ నటుడు బాబి సింహ ఫ్లోలో “సలార్ 2” అప్డేట్ గురించి చెప్పేశారు. ఇంటర్వ్యూలో భాగంగా ఆయన లైనప్ గురించి ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు సమాధానంగా బాబి సింహ పలు సినిమాలు చేస్తునట్టు చెప్పుకొచ్చారు. అలాగే “సలార్ 2″లో తన పాత్ర కంటిన్యూ అవుతున్నట్టుగా వెల్లడించారు. దీంతో “సలార్ 2” షూటింగ్ ఎప్పుడు మొదలు కావచ్చు? అని అడిగారు. వెంటనే బాబి ఈ ఏడాది ఏప్రిల్ లోనే “సలార్ పార్ట్ 2” షూటింగ్ మొదలు పెట్టడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. దీంతో ప్రభాస్ అభిమానుల సంతోషానికి హద్దే లేకుండా పోయింది. బాబీ చెప్పినట్టుగా ఏప్రిల్ లో సలార్ 2 షూటింగ్ మొదలైతే వచ్చే ఏడాదే ఈ సీక్వెల్ రిలీజ్ కావడం పక్కా. ఈ సినిమాలో శౌర్యంగ తెగకు చెందిన భార్గవ అనే పాత్రను బాబి పోషిస్తున్న విషయం తెలిసిందే.

"Salaar 2" Update given by Bobby Simha

ఇంకా టైం పడుతుందా?
ఒకవేళ “సలార్ పార్ట్ 2” షూటింగ్ ఏప్రిల్ లో మొదలైనప్పటికీ ప్రభాస్ షూటింగులో పాల్గొనే అవకాశాలు తక్కువే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ప్రభాస్ రాజా సాబ్, కల్కి సినిమాలను పూర్తి చేయాల్సి ఉంది. ఇవి రెండు పూర్తయ్యాకే “సలార్ 2” సెట్స్ లోకి ప్రభాస్ అడుగు పెడతారు.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు