Sai Dharam Tej: మంచి మనసు చాటుకున్న మెగా మేనల్లుడు..!

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోలు మేము తెరమీద మాత్రమే హీరోలము కాదు తెరవెనుక కూడా హీరోలమే అంటూ నిరూపించుకుంటున్నారు. ఈ క్రమంలోనే మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా తాజాగా మహేష్ బాబు బాటలో నడుస్తున్నారని స్పష్టమవుతోంది. ఇక ఇప్పటికే మహేష్ బాబు సినిమాల ద్వారా భారీగా సంపాదిస్తూ ఎంతోమంది చిన్నారులకు గుండె శస్త్ర చికిత్స చేయిస్తూ.. వారిని ఆదుకుంటున్న విషయం తెలిసిందే.. అయితే తాజాగా మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ కూడా ఇద్దరు చిన్నారుల ఆరోగ్య విషయంలో రియల్ హీరో అనిపించుకున్నారు. ఇక అసలు విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఇక అసలే విషయంలోకి వెళ్తే.. తాజాగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ బాబు పేరుతో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ప్రత్యక్షమవగా.. అందులో తనకు తెలిసిన ఒక అనాధాశ్రమం నుంచి ఇద్దరు చిన్నారుల ట్రీట్మెంట్ కి సహాయం కావాలి అంటూ కాల్ వచ్చింది.. ఈ విషయం గురించి వెంటనే సాయి ధరమ్ తేజ్ కి మెసేజ్ పెట్టారట. అయితే క్షణం ఆలోచించకుండా ఆ మెసేజ్ కి వెంటనే స్పందించి సహాయం చేశారట ఈ సుప్రీం హీరో.. ఆండ్రూ బాబు ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో సాయిధరమ్ తేజ్ ఇలాంటి సహాయాలు ఎన్నో చేశారు కానీ ఎక్కడా బయట చెప్పుకోలేదు.. విజయవాడలో వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఆశ్రమాన్ని కూడా కట్టించారు..

అంతేకాదు ఆయన చేసిన గుప్త దానాల గురించి తెలిస్తే మాత్రం నిజంగా ఆశ్చర్య పోవాల్సిందే. ఇక ఇప్పుడు తాజాగా చిన్నారుల ప్రాణాలు కాపాడి మరొకసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఇకపోతే తేజ్ చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపిన ఒక వీడియోని కూడా ఆండ్రూ బాబు ట్వీట్ కి జోడించారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త వైరల్ అవ్వడంతో పలువురు నెటిజన్లు తేజ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

- Advertisement -

ఇక సాయిధరమ్ తేజ్ సినిమాల విషయానికి వస్తే.. యాక్సిడెంట్ తర్వాత పునర్జన్మ పొంది మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన రిపబ్లిక్ సినిమాతో ఘోర డిజాస్టర్ ను చూశారు.. తర్వాత విరూపాక్ష సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈయన.. తేజ్ మేనమామ పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో సినిమాలో చేశారు. అయితే ఈ సినిమా కూడా డిజాస్టర్ గానే నిలిచింది.. ఇక ప్రస్తుతం ఆచితూచి సినిమా కథల ఎంపిక విషయంలో అడుగులు వేస్తున్న సాయి ధరమ్ తేజ్ తాజాగా సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు.. ఇటీవల ఈ సినిమా టైటిల్ విషయంలో వివాదం ఏర్పడిన విషయం తెలిసిందే.. ఇక మరి ఈ సినిమాతో ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తారో చూడాలి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు