Saripodha Sanivaram: శనివారమే కోపం… నాని కొత్త రూట్

ప్రముఖ డైరెక్టర్ మరియు రచయిత వివేక ఆత్రేయ దర్శకత్వంలో.. నాని హీరోగా.. డీవీవీ దానయ్య నిర్మాణం లో రెండవసారి తెరకెక్కుతున్న చిత్రం సరిపోదా శనివారం.. ఇప్పటికే ఈ కాంబినేషన్లో “అంటే సుందరానికి” సినిమా వచ్చి పర్వాలేదు అనిపించుకుంది. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు.. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి గ్లింప్ రిలీజ్ చేయగా.. అది బాగా వైరల్ అవుతోంది.

ఇకపోతే ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్ ను తాజాగా ఉదయం 11 గం. 59 ని. లకు రిలీజ్ చేశారు.. అయితే నిన్న ఈ విషయాన్ని తెలియజేస్తూ నాని షాడో లుక్ లో ఉన్న పిక్ ని కూడా రిలీజ్ చేశారు.. తాజాగా విడుదల చేసిన గ్లింప్ తో సినిమా పై అంచనాలు పెంచేసింది చిత్ర బృందం.. మరీ ఆ గ్లింప్ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటోందో ఇప్పుడు చూద్దాం.

ఇకపోతే ఈరోజు నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఈ గ్లింప్ రిలీజ్ చేసింది. ఇక ఈ గ్లింప్ విషయానికి వస్తే.. “కోపం ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటుంది .. అయితే ఆ కోపాన్ని కూడా చూపించే విధానంలో ఒక నియమ నిబద్ధత ఉంటుంది.. అందులోనూ వారంలో ఒక్కరోజు మాత్రమే కోపాన్ని చూపించే పిచ్చి నా కొడుకుని మీరు ఎప్పుడైనా చూసారా” అంటూ గ్లింప్ స్టార్ట్ అవుతుంది.

- Advertisement -

ఇది చూసినంత సేపు ఇందులో యాక్షన్ ఎలివేషన్ తో కూడిన సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి.. ఇందులో నాని మాస్ లుక్ లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకబోతున్నారు ముఖ్యంగా ఈ సినిమా దసరా మూవీ లెవెల్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇక చివర్లో ఒక పోలీస్ ఆఫీసర్ నిందితులను చితకబాది ఆ తర్వాత అలసిపోయి హ్యాపీ బర్త్డే బ్రదర్ అంటూ నానికి బర్త్ డే విషెస్ చెప్పడం ఇప్పుడు గ్లింప్ కే హైలెట్గా నిలిచిందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఈ గ్లింప్ అభిమానులనే కాదు సినీ ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటుంది .. ఇక నాని బర్త్ డే సందర్భంగా విడుదలైన ఈ గ్లింప్ విపరీతమైన లైక్స్ ని కూడా సొంతం చేసుకుంటూ అలాగే సినిమాపై అంచనాలను పెంచేస్తోందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు