Samantha: బికినీతో ప్రకృతి ఒడిలో పరవశించిపోతున్న సమంత..!

స్టార్ హీరోయిన్ సమంత తాజాగా వెకేషన్ మోడ్ లో వున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆమె మలేషియాలోని లంకావిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే అక్కడి నుండి కొన్ని కొత్త చిత్రాలను కూడా పంచుకుంది. ఇక్కడ సుందరమైన ప్రదేశాలతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణంలో తాను ఎంజాయ్ చేస్తున్న విధానాన్ని అభిమానులతో పంచుకుని మురిసిపోయింది సమంత..
శుక్రవారం సాయంత్రం తన ఇంస్టాగ్రామ్ లో ఈ ఫోటోలను షేర్ చేయగా.. ఇవి కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

ఇకపోతే తాజాగా సమంత షేర్ చేసిన ఫోటోలను చూస్తే.. మనుపెన్నడూ లేని విధంగా బికినీలో దర్శనమిచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది.. ఇందులో సమంత బ్రౌన్ కలర్ బికినీ ధరించి.. చుట్టూ కొండలు మధ్యలో కొలను… అందులో జలకాలాడుతూ తన అందమైన ఫోటోలను షేర్ చేసింది. దటాయ్ లంకావీ లో బస చేసిన ఈమె.. పచ్చదనం తో కూడిన ప్రదేశాన్ని.. తామర పువ్వులతో నిండిన కొలను ఫోటోలను కూడా షేర్ చేసింది..అంతేకాదు సుందరమైన చెక్క ఇంటిని కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

సమంత సినిమాల విషయానికి వస్తే.. ఏ మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోలు అందరితో కూడా కలసి నటించిన ఈమె గత కొంతకాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో ఇండస్ట్రీకి సంవత్సర కాలం పాటు విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇలా వెకేషన్ ఎంజాయ్ చేస్తూ.. మరోపక్క తనకు వచ్చిన వ్యాధికి చికిత్స తీసుకుంటుంది. ఇకపోతే కోలీవుడ్ , టాలీవుడ్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె హిందీలో సిటాడెల్ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కి సిద్ధంగా కాబోతోంది. ఇందులో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -

ఇక సమంత వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. ఏం మాయ చేసావే సినిమాలో సహనటుడు అక్కినేని వారసుడు నాగచైతన్య తో ప్రేమలో పడి దాదాపు ఏడు సంవత్సరాలు పాటు ప్రేమించుకున్న వీరు 2017 లో పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. వివాహం జరిగిన నాలుగేళ్లకే విడాకులు ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఇక అప్పటినుంచి విడిగా ఉంటున్న వీరు ఎవరికివారు తమ సినీ కెరియర్ లో బిజీ అయిపోయారు.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు