RRR: మరోసారి తెర మీదకు…

2022 లో తెలుగు సినిమా చరిత్రలో రికార్డులు సృష్టించి, అంతర్జాతీయ స్థాయిలో అభినందనలు అందుకున్న సినిమా ”రణం రుధిరం రౌద్రం” అనగా ఆర్.ఆర్.ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాటు ఆలియా భట్, శ్రియ శరన్, అజయ్ దేవగన్, ఒలీవియా మోరిస్ కలిసి నటించారు.

ఎం.ఎం. కీరవాణి అందించిన సంగీతం సినిమాకే ప్లస్ పాయింట్ అయింది అని చెప్పొచ్చు. ఈ చారిత్రిక చిత్రం ఇప్పటికే గ్లోబల్ లెవెల్ లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ , బెస్ట్ క్రిటిక్స్ కు పురస్కారాలు అందుకున్న విషయం తెలిసిందే. వరల్డ్ వైడ్ గా ఇప్పటికే పలు భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవుతూ ఉండగా, స్పెషల్ షోస్ కూడా వేస్తూన్నారు. దీంతో ఆర్ఆర్ఆర్ ఆస్కార్ పోటీలో మరింత ముందుకు వెళ్తోంది.

లెటెస్ట్ గా ఈ సినిమా తెలుగు లో కూడా రీ రిలీజ్ కు సిద్ధం అవుతుంది. జనవరి 20న ఈ సినిమా రీ రిలీజ్ కానుంది. దాదాపు 5 రోజుల పాటు ఈ సినిమా థియేటర్స్ లలో మళ్లీ రన్ కానుంది. హైదరాబాద్ లోని ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ లో, దేవి 70 ఎం.ఎం థియేటర్ల లో రీ రిలీజ్ చేయనున్నారు.

- Advertisement -

రిలీజ్ అయి ఇన్ని నెలలు అయినా ఈ సినిమా క్రేజ్ రోజు రోజుకు పెరుగుతుంది. అంతర్జాతీయ స్థాయికి వ్యాపిస్తుంది. కానీ ఎక్కడా తగ్గట్లేదు. ఇక ఈ రీ రిలీజ్ తో సినిమా క్రేజ్ మరింత పెరగడమే కాదు.. రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను కూడా తెచ్చి పెడుతుందని చెప్పొచ్చు.

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు