Hunt: కమిషనర్ ను చంపింది ఎవరు?

మహేష్ సూరపనేని దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వచ్చిన తాజా చిత్రం ”హంట్”. దీనికి ”గన్స్ డోంట్ లై” అనే టాగ్ లైన్ ఇచ్చారు. ఈ సినిమాలో శ్రీకాంత్ , ప్రేమిస్తే ఫేమ్ ‘భరత్’ ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీగా ఉంది.

ఈ యాక్షన్ థ్రిల్లర్ జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతానికి సినిమా ప్రమోషన్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా రెబెల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదగా మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు.

ట్రైలర్ ప్రారంభంలో.. ”ఏ కేసునైతే ఆ అర్జున్ సాల్వ్ చేయలేకపోయాడో, ఆ కేసును ఈ అర్జున్ సాల్వ్ చేయాలి” అని శ్రీకాంత్ చెప్పే డైలాగ్ తో ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ ను క్రియేట్ చేస్తోంది. ఆ తరువాత సుధీర్ బాబు కు యాక్సిడెంట్ అయి గతం మర్చిపోవటం చూపిస్తారు.

- Advertisement -

కమిషనర్ మర్డర్ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న సుధీర్ బాబు మధ్యలో, ఆక్సిడెంట్ అయి గతం మర్చిపోయిన సుధీర్ బాబుతో శ్రీకాంత్ ”నువ్వు కోల్పోయింది నీ మెమరీ ని మాత్రమే, నీ ఆలోచన శక్తిని కాదు” అని మళ్ళి కేసును టేకోవర్ చేయాలనీ ప్రోత్సహిస్తూ ఆ చనిపోయిన పోలీస్ ఆఫీసర్ వాళ్ళకి మంచి మిత్రుడు అని చెప్తాడు. దీనితో కమిషనర్ మర్డర్ కేసును సుధీర్ బాబు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడని, అది పెద్ద సవాళ్లతో కూడినది అని తెలుస్తోంది.

ఈ కేసును ఛేదించే క్రమంలో సుధీర్ ఎలాంటి అనుకోని సంఘటనలను ఎదుర్కోవాల్సి వస్తుంది ? అసలు ఆ మర్డర్ ఎవరు చేసారు ? ఎందుకోసం చేసారు ? అసలు సుధీర్ బాబు ది ఆక్సిడెంటేనా ? అని తెలియాలంటే జనవరి 26న విడుదలకాబోయే హంట్ సినిమాను చూడాల్సిందే.

ట్రైలర్ లో గిబ్రన్ అందించిన మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. సినిమాకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ అయ్యేలా ఉంది. మొత్తానికి ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు భారీగా పెంచారు.

Sudheer Babu’s Hunt Movie Official Trailer

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు