OSCAR: తమ్మారెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మెగా బ్రదర్ నాగబాబు

ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రపంచమంతా గొప్పగా మాట్లాడుకుంటుంది. కానీ ప్రముఖ సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ మాత్రం ఆర్ఆర్ఆర్ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఏకంగా 80 కోట్లు ఖర్చు పెట్టారని, అంత మొత్తాన్ని తమలాంటి కొందరి చేతిలో పెడితే ఎనిమిది నుంచి పది సినిమాలు తీసే వాళ్ళమని అన్నారు.

కేవలం ఫ్లైట్ టికెట్స్ కోసమే ఆర్ఆర్ఆర్ టీం అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు అంటూ ఆయన కామెంట్ చేశారు. ఓ సీనియర్ దర్శకనిర్మాత ఇలా కామెంట్ చేయడంపై ఫ్యాన్స్, నేటిజన్స్ ఫైర్ అయ్యారు. దీనిపై పెద్ద ట్రోలింగ్ నడిచింది. అయితే తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు.

తమ్మారెడ్డి పేరును నేరుగా ప్రస్తావించలేదు కానీ ఘాటు పదజాలంతో ఆయనపై రివర్స్ అటాక్ చేశారు. నాగబాబు ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. ” నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా రూ. 80 కోట్లు ఆర్ఆర్ఆర్ కి ఆస్కార్ కోసం. #RRR మీద కామెంట్ కి వైసిపి వారి భాషలో సమాధానం” అని ట్వీట్ చేశారు. మరి దీనిపై తమ్మారెడ్డి భరద్వాజ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. అలాగే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సైతం ట్విట్టర్ లో తమ్మారెడ్డికి కౌంటర్ ఇచ్చారు. 80 కోట్లు ఖర్చు చేశారని చెప్పడానికి నీవద్ద అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఇక నాగబాబు చేసిన ట్వీట్ ని ఉద్దేశించి తమ్మారెడ్డి భరద్వాజ్ కు భలే కౌంటర్ పడింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు