Summer War: చిన్న హీరోల పెద్ద సాహసం…

టాలవుడ్‌లో హీరోల ఎంట్రీ ఈ మధ్య కాలంలో ఎక్కువ జరుగుతుంది. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తున్న ప్రముఖులు తమ కుటుంబం నుంచి కొత్తగా హీరోలను పరిచయం చేస్తున్నారు. ఇటీవలే నందమూరి కుటుంబం నుంచి చైతన్య కృష్ణ అనే హీరో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇలాంటి కొత్త హీరోలు తమ సినిమాలను విడుదల చేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. కానీ, ఓ కొత్త హీరో.. వరుస సినిమాలతో విఫలం అవుతున్న మరో కుర్ర హీరో పెద్ద సాహసం చేస్తున్నారు. వారే.. దగ్గుబాటు అభిరామ్, కిరణ్ అబ్బవరం.

దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి దగ్గుబాటి అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. తేజ దర్శకత్వంలో “అహింస” అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే ఈ సినిమాను ఇప్పటికే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా “అహింస”ను సమ్మర్ కానుకగా ఏప్రిల్ 7న విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేసేశారు.

అలాగే ఫ్లాప్స్, హిట్స్ సంబంధం లేకుండా… వరుసపెట్టి సినిమాలు చేస్తున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఈయన నుంచి ఇటీవలే వినరో భాగ్యం విష్ణు కథ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా వచ్చన రెండు నెలల్లోనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాను నటించిన “మీటర్” సినిమాను కూడా సమ్మర్ బరిలోనే ఉంచబోతున్నాడు. ఈ సినిమాను ఏప్రిల్ 7నే విడుదల చేయబోతున్నారు.

- Advertisement -

అయితే ఈ సారి బాక్సాఫీస్ వద్ద సమ్మర్ హీట్ కాస్త ఎక్కువే ఉంది. నేచురల్ స్టార్ నాని నుంచి వస్తున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ “దసరా” మార్చి 30న రాబోతుంది. ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. అలాగే “ధమాకా” “వాల్తేరు వీరయ్య” వరుస హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్న మాస్ మహారాజ రవితేజ తన తర్వాతి చిత్రం “రావణాసుర” ను కూడా సమ్మర్ బరిలోనే దింపారు. ఈ చిత్రం ఏప్రిల్ 7నే విడుదల కానుంది.

అలాగే లేటెస్ట్ పాన్ ఇండియా స్టార్ సమంత చేస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ “శాకుంతలం”. ఈ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచి అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇది కూడా సమ్మర్ బరిలో నిలవబోతుంది. ఇది ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో పాటు రాఘవ లారెన్స్ “రుద్రుడు”, విజయ్ ఆంటోని “బిచ్చగాడు 2” సినిమాలు కూడా ఏప్రిల్ 14న విడుదల కాబోతున్నాయి.

ఇన్ని పెద్ద సినిమాల మధ్య ఈ కొత్త హీరో, యంగ్ హీరో తమ సినిమాలను రిలీజ్ చేయడం పెద్ద సాహసమే అని చెప్పాలి. స్టోరీపై నమ్మకం ఉందా ? లేదా ఎప్పుడు రిలీజ్ చేస్తే ఏంటి ? సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తే చాలు అని అనుకుంటున్నారా? అనేది ఇక్కడ ప్రశ్న.

కిరణ్ అబ్బవరం కు ఇది కాస్త కామన్. కానీ, కొత్త హీరో దగ్గుబాటి అభిరామ్ అయిన కొంత వరకు ఆలోచించాలి. సోలోగా వస్తే కనీసం కొంత మేరకు అయినా, గుర్తింపు, కలెక్షన్లు వస్తాయి. కానీ ఇలాంటి స్టార్స్ మధ్య వస్తే.. వచ్చే ఫలితం వేరే ఉంటుంది అని వారికి తెలియదా..? మరి స్టార్స్ సినిమాలను ఈ కుర్ర హీరోలు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు