Raviteja: బాక్సాఫీస్ ధమాకా

రవితేజ ప్రస్తుతం వరుస సినిమాల తో చాలా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ధమాకా, వాల్తేరు వీరయ్య , రావణాసుర వంటి సినిమాలతో గత కొన్ని రోజులుగా బిజీ షెడ్యూల్ గడుపుతున్నాడు రవితేజ .’పెళ్లి సందడి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన శ్రీ లీల, తన క్యూట్ నెస్ తో మొదటి సినిమాకే అభిమానుల సంఖ్యను ఓ రేంజ్ లో పెంచుకుంది.

తాజాగా ఈ మాస్ మహా రాజా , యంగ్ బ్యూటీ కలిసి నటించిన సినిమా ‘ధమాకా’. ఈ సినిమా డిసెంబర్ 23 న థియేటర్ లో విడుదల అయింది. అయితే అందులో రవితేజ ఎనర్జీ తో, శ్రీ లీల క్యూట్ ఎక్స్ప్రెషన్స్ మరియు డాన్స్ తో ఆడియన్స్ ని కట్టి పడేసారు. ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయి ఒక వారం పూర్తి అయింది.

ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ”ధమాకా” ను ట్.జి విశ్వా ప్రసాద్ 40 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా, మొదటి వరం లోనే ప్రపంచ వ్యాప్తంగా 62 కోట్ల కలెక్షన్ తో బాక్స్ ఆఫీస్ లో దూసుకెళ్తుంది. ‘త్రినాథ రావు నక్కిన’ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా పేరు తెచ్చుకోవటం విశేషం. ఈ సినిమా లో శ్రీ లీల డాన్స్ మెయిన్ అట్రాక్షన్ గా ఉండగా, భీమ్స్ మ్యూజిక్ కూడా తోడై సెన్సేషన్ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు