Pushpa : రష్మిక మోకాలు.. బన్నీ షోల్డర్

“రష్మికమందన్న” కన్న‌డ ఇండ‌స్ట్రీ నుంచి వెండి తెర‌కు ప‌రిచ‌య‌మైంది. ఇప్పుడు నేష‌న‌ల్ క్ర‌ష్‌గా మారింది. అందం, అభిన‌యం, త‌న‌దైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. అతి త‌క్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌ల జాబితా చోటు సంపాదించుకుంది. ముఖ్యంగా పుష్ప చిత్రంతో దేశ‌వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ప్ర‌స్తుతం చేతినిండా  సినిమాల‌తో ఫుల్ బిజీగా గ‌డుపుతోంది. ప‌లు యాడ్స్ తో బిజీగా ఉన్న ర‌ష్మిక తాజాగా ఆరోగ్యం విష‌యంపై ఓ వైద్యుడిని సంప్ర‌దించింది.

త‌మ అభిమాన న‌టికి అస‌లు ఏమైంది అని ఫ్యాన్స్ తెగ కంగారు ప‌డిపోయారు. ఈ విష‌యంపై డాక్ట‌ర్ అధికారికంగా స్పందించారు. ఓ ప్ర‌ముఖ డాక్టర్  ఫేస్ బుక్ వేదిక‌గా త‌న‌ను క‌లిసిన సెలెబ్రిటీ ఫోటోల‌ను అప్పుడ‌ప్పుడు షేర్ చేస్తుంటాడు. గ‌తంలో ప్ర‌కాశ్ రాజ్‌తో పాటు మ‌రికొంద‌రూ ఫోటోల‌ను షేర్ చేసిన ఆయ‌న తాజాగా ర‌ష్మిక‌తో దిగిన ఫోటోను పోస్ట్ చేశారు.

ఇంత‌కు ర‌ష్మిక త‌న‌ను ఏ స‌మ‌స్య కోసం సంప్ర‌దించ‌డానికి వ‌చ్చిందో కాస్త ఫ‌న్నీగా చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. ఈ విష‌యంపై ఆయ‌న పోస్ట్ చేస్తూ “నువ్వు సామి సామి అంటూ మోకాళ్ల మీద బ‌రువు అంతా వేసి డ్యాన్స్ చేయ‌డం ద్వారానే ఇలా నొప్పులు వ‌చ్చి ప‌డ్డాయి” అని చెప్పుకొచ్చారు.  “ర‌ష్మిక‌ మోకాలి నొప్పి అంటూ వ‌చ్చింది. బ‌న్నీ కూడా త్వ‌ర‌లో షోల్డ‌ర్ పెయిన్‌తో వ‌స్తాడేమో” అంటూ స‌ర‌దాగా రాసుకొచ్చారు. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. దీంతో ర‌ష్మిక‌కు ఏమైందో అని కంగారు ప‌డ్డ అభిమానులు  ఈ పోస్ట్ తో  ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు