టాలీవుడ్ హీరోయిన్ రష్మిక గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా ఇటీవల అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాతో ఆమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయిందనే చెప్పాలి. దక్షిణాదిలో వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది నేషనల్ క్రష్. బాలీవుడ్ నుంచి కూడా రష్మికకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం హిందీలో ఓ మూడు సినిమాల్లో నటిస్తోంది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్‌తో కలిసి గుడ్ బై సినిమాలో నటించింది.
అదేవిధంగా సిద్దార్థ్ మల్హోత్రా సరసన మిస్టర్ మజ్క్షు, రణబీర్ కపూర్ జోడిగా యానిమల్ చిత్రాల్లో కూడా నటిస్తుంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని అక్టోబర్ 07న గుడ్ బై చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంది. సినిమా ప్రమోషన్‌లలో పాల్గొన్న రష్మిక తన మాజీ బాయ్ ఫ్రెండ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇటీవలే రష్మిక ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఏదైనా పార్టీలో మీ మాజీ భాయ్ ఫ్రెండ్ ఎదురుపడితే ఏం చేస్తారని యాంకర్ ప్రశ్నించగా.. తనకు హాయ్ చెబుతానని తెలిపింది.
Read More: Naa Peru Seesa : మ్యాజికల్ వాయిస్, హాట్ డాన్స్
”వారితో నేను ఇప్పటికీ కూడా స్నేహంగానే ఉన్నాను. మేము మంచి స్నేహితులం. అదేవిధంగా వారి కుటుంబంతో గతంలో ఎలాంటి సంబంధాలున్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. భవిష్యత్ లో కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. వారితో నాకు చాలా మంచి అనుబంధం ఉంది” అంటూ చెప్పుకొచ్చింది. కెరీర్ ప్రారంభంలో రష్మిక కన్నడ హీరో రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం చేసుకున్న విషయం విధితమే. ఆమె మొదటి సినిమా కిరిక్ పార్టీ చిత్రీకరణ సమయంలో వీరిద్ధరి మధ్య ప్రేమ చిగురించింది. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో 2017లో నిశ్చితార్థం జరిగింది. అదే ఏడాది వీరిద్దరూ విడిపోయారు. ఇక ఆ తరువాత రష్మిక వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది.
Read More: Priyamani : మరోసారి
‘శ్రీమంతుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్...
మొదట సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి...
ఒక సినిమాకు డైరెక్టర్… కెప్టెన్ అఫ్ ది...
అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ డైరెక్టర్...
నితిన్ హీరోగా నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ...