Rashmi: అతనితో యాంకర్ రష్మీ ఎఫైర్… షాక్ లో సుధీర్ ?

Rashmi Gautham: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు ఉన్నారు. అందులో కొంతమంది హీరోయిన్లు అయితే కొంతమంది హీరోలు. అయితే హీరోలు అలాగే హీరోయిన్లతో పాటు ఈ మధ్యకాలంలో యాంకర్లు కూడా బాగా ఫేమస్ అవుతున్నారు. ఎక్కడా లేని యాంకర్లు మన టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఉన్నారు. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్లకు భారీగా డిమాండు పెరగడమే కాకుండా వారి మధ్య పోటీ కూడా నెలకొంది. కొంతమంది సినిమాలు చేసి ఆ తర్వాత యాంకరింగ్ చేస్తే… మరి కొంతమంది యాంకరింగ్ చేసి సినిమాలలోకి వస్తున్నారు.

అయితే కొన్ని చిన్న చిన్న సినిమాలలో కనిపించి ఆ తర్వాత యాంకరింగ్ వచ్చిన వారిలో రష్మీ ఒకరు. యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలామంది రష్మీ అలాగే రష్మిక మందాన పేరులో చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. కానీ హీరోయిన్ రష్మిక మందాన అలాగే రష్మీ వేరువేరే. ఎవరి ఫాలోయింగ్ వారికి ఉంది. అయితే యాంకర్ రష్మీ యాంకరింగ్ తో పాటు ఇప్పటివరకు చాలా సినిమాలోనే నటించింది. ఇప్పటికే కూడా సినిమాల వల్ల ఛాన్సులు వస్తే చేస్తోంది రష్మీ.

ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షో ద్వారా నటి, యాంకర్ రష్మీ మంచి పాపులర్ అయింది. అనసూయ జబర్దస్త్ విడినప్పటికీ ఇప్పటికీ కూడా జబర్దస్త్ను పట్టుకొని రాణిస్తోంది యాంకర్ రష్మి. ఎంతోమంది యాంకర్లు అలాగే హీరోయిన్లపై నెగటివ్ కామెంట్స్ వచ్చినప్పటికీ… ఇప్పటివరకు రష్మీ పైన ఎలాంటి నెగటివ్ ప్రచారం మాత్రం జరగలేదు. ఎందుకంటే ఎంతో సాంప్రదాయ బద్ధంగా అలాగే క్రమశిక్షణ మైంటైన్ చేస్తూ ఉంటుంది రష్మీ.

- Advertisement -

దీనికి ఎగ్జాంపుల్ యాంకర్ అనసూయ. యాంకర్ అనసూయ ను ఎప్పుడూ సోషల్ మీడియాలో టోల్ చేస్తూనే ఉంటారు. దీనికి కారణం ఆమె ఓవరాక్షన్ అన్న సంగతి తెలిసిందే. కానీ రష్మీ అట్లా కాదు. చాలా అందంగా ఉండటమే కాకుండా అందరిని ఎంటర్టైన్ చేస్తూ పద్ధతిగా ఉంటుంది. అయితే అలాంటిది యాంకర్ రష్మీ… సుధీర్ తో ప్రేమలో ఉందని చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. కానీ ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని చాలాసార్లు రష్మీ మరియు సుధీర్ తేల్చి చెప్పారు.

కానీ వీరిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని… త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కొంతమంది నిత్యం ప్రచారం చేస్తూనే ఉన్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో సుధీర్ కు ఊహించని షాక్ ఇచ్చిందట యాంకర్ రష్మీ. త్వరలోనే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైందట యాంకర్ రష్మీ. అయితే ఈ పెళ్లి సుధీర్ తో కాకుండా అమెరికాలో ఉన్న ఓ వ్యక్తితో రష్మీ పెళ్లి జరగనుందట.

అమెరికాలో ఉన్న ఓ వ్యక్తిని చాలా రోజుల నుంచి రష్మీ ప్రేమిస్తోందట. మీరు మధ్య రిలేషన్ చాలా దూరం వెళ్ళిందని సమాచారం. అయితే ఈ విషయం రష్మీ అలాగే అతని కుటుంబ సభ్యులకు కూడా తెలుసట. అందుకే వీరిద్దరి పెళ్లికూడా ఫిక్స్ చేశారట. త్వరలోనే అమెరికాకు చెందిన వ్యక్తి అలాగే రష్మీ పెళ్లి చేసుకోబోతున్నారట. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు