Trivikram : బాలీవుడ్ రామాయణంలో మాటల మాంత్రికుడు… రోల్ ఏంటంటే..?

Trivikram : బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి డ్రీమ్ ప్రాజెక్ట్ రామాయణం పట్టా లెక్కబోతున్న విషయం తెలిసిందే. ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా కనిపించబోతున్నాడు. అయితే ఈ ప్రాజెక్టుపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. కానీ అప్పుడే పలు రూమర్లు మాత్రం వైరల్ అవుతున్నాయి. తాజాగా బాలీవుడ్ రామాయణంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా భాగం కాబోతున్నాడు అనే వార్త బయటకు వచ్చింది. మరి ఇంతకీ ఈ మూవీలో త్రివిక్రమ్ రోల్ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

హిందీ రామాయణంలో మాటల మాంత్రికుడు…

బాలీవుడ్ రామాయణంలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, మాలీవుడ్ బ్యూటీ సాయి పల్లవి సీతారాములుగా కనిపించబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నట్టు సమాచారం. ఆ పనులు అయిపోగానే మూవీని గ్రాండ్ గా లాంచ్ చేసి వీలైనంత త్వరగా షూటింగ్ ను పూర్తి చేయడానికి నితీష్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ ప్రాజెక్టు గురించే చర్చ నడుస్తోంది. సినిమాలో స్టార్ కాస్ట్ నుంచి టెక్నీషియన్స్ వరకు వారి పేర్లతో సహా రోజుకో పుకారు షికారు చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ మూవీలో భాగం కాబోతున్నారు. రామాయణంను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించబోతున్నారు. కాబట్టి నితీష్ ప్రతి భాషకు సంబంధించిన అనువాదం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే ఏ భాషకు ఆ భాషలో డైలాగ్స్, మాటల కోసం ప్రత్యేకంగా ఆయా భాషల ప్రముఖులను సంప్రదిస్తుందట రామాయణం టీం. ఈ క్రమంలోనే తెలుగు వెర్షన్ రామాయణం కోసం నితీష్ డైరెక్టర్ త్రివిక్రమ్ సాయం కోరినట్టుగా ఇన్సైడ్ టాక్. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తోంది. కానీ ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది మాత్రం తెలియాల్సి ఉంది.

మూడు భాషల్లో వేరువేరుగా రామాయణం షూటింగ్…

త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ రైటింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయనకు వచ్చిన మాటల మాంత్రికుడు అనే బిరుదును చూస్తేనే త్రివిక్రమ్ ఎలాంటి డైలాగ్స్ ఇస్తారో అర్థమవుతుంది. ముందుగా రచయితగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన త్రివిక్రమ్ ప్రస్తుతం డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతో, ఆయనతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా భీమ్లా నాయక్, బ్రో సినిమాల కోసం కలం పట్టారు గురూజీ. ఈ నేపథ్యంలోనే ఆయన రామాయణ మూవీకి మాటలు రాయడానికి ఒప్పుకుంటారా? అనే అనుమానం మొదలైంది. అయితే నితీష్ రామాయణాన్ని ఏ భాషకు ఆ భాషలో ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారని, అవసరం అనిపిస్తే హిందీ తో పాటు తెలుగు, తమిళ భాషల్లో వేరువేరుగా షూటింగ్ జరపాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఒకవేళ నిజంగానే ఈ మూవీకి త్రివిక్రమ్ మాటల రచయితగా పని చేస్తే హిందీ రామాయణంకు టాలీవుడ్ లో భారీ క్రేజ్ ఏర్పడడం ఖాయం. మరేం జరుగుతుందో తెలియాలంటే దీనిపై అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చేదాకా వెయిట్ అండ్ సి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు