Ram charan:మరో మల్టీ స్టార్రర్?

2022 ఏడాది గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డులు క్రియేట్ అయ్యాయి. డబుల్ డోస్ ఇస్తామంటూ కొందరు హీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేసి ఎన్నడూ ఊహించని కాంబినేషన్లతో బాక్స్ ఆఫీస్ వద్ద రచ్చ చేశారు. అలా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మల్టీ స్టారర్ ట్రెండ్ ఊపందుకుంది. దానికి వచ్చిన వరల్డ్ వైడ్ రెస్పాన్స్ చూసి సరైన కథ, దర్శకుడు పడితే ఏ రేంజ్ లో సంచలనాలు క్రియేట్ చేయొచ్చో ఇండస్ట్రీ గమనించింది.

ఈ నేపథ్యంలోనే తెలుగు ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాల హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలైన వాల్తేరు వీరయ్య లో చిరంజీవి, రవితేజ కాంబో ఎంత ప్లస్ అయిందో కూడా చూస్తున్నాం. తాజాగా అలాంటి మరో కలయిక కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం.

కోలీవుడ్ హీరో సూర్య – టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ కి ప్లాన్ చేస్తున్నారట సీతారామం ఫెమ్ హను రాఘవపూడి. తాజాగా ఈ మూవీ స్టోరీని సూపర్ స్టార్ సూర్యకు వివరించినట్లు తెలుస్తోంది. సూర్యకి ఈ కథ బాగా నచ్చింది కానీ ఇందులో మరో స్టార్ హీరో క్యారెక్టర్ గురించి డిస్కషన్స్ జరుగుతున్నట్లు సమాచారం. ఈ స్పెషల్ రోల్ కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాగుంటాడని భావిస్తున్న సూర్య.. ఒకసారి చరణ్ ను కలవాల్సిందిగా హను రాగవపూడి కి సూచించారట.

- Advertisement -

కానీ రామ్ చరణ్ ఇప్పటికే శంకర్ తో పాన్ ఇండియా మూవీ తో పాటు బుచ్చిబాబు తో ఓ ప్రాజెక్టుని లాక్ చేసుకున్నాడు. ఆ తర్వాత సుకుమార్ తోను ఓ ప్రాజెక్ట్ లైన్లో ఉంది. అలాంటప్పుడు ఒకవేళ నిజంగా రామ్ చరణ్ కి స్టోరీ నచ్చినా వెంటనే చేయలేని పరిస్థితి రావచ్చు. ఈ నేపథ్యంలో సూర్య మూవీలో నటించడం కష్టమేనన్న కామెంట్స్ వినిపిస్తుండగా.. అదే సమయంలో కథ నచ్చితే చేయోచ్చని కూడా అభిప్రాయపడుతున్నారు నేటిజెన్లు.

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు