Yash:రాకీ భాయ్ కు బంపర్ ఆఫర్

కేజీఎఫ్ సినిమాతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నాడు రాక్ స్టార్ యష్. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కేజీఎఫ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీని తర్వాత భారీ అంచనాలతో వచ్చిన కేజీఎఫ్ 2 బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన భారతీయ చిత్రాల్లో కేజీఎఫ్ 2 రెండో స్థానంలో నిలిచింది. అయితే కేజీఎఫ్ 2 తర్వాత యష్ ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్ట్ ను కూడా ప్రకటించలేదు.

త్వరలోనే ఓ శాండిల్ వుడ్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా, యష్ కు ఒక భారీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్‌, నమిత్‌ మల్హోత్ర, మధు మంతెన కలిసి రామయణాన్ని సినిమా చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్న సంగతి విధితమే. ఈ సినిమా కోసం దాదాపు రూ. 1500 కోట్ల బడ్జెట్ ను కేటాయించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ లో యష్ అవకాశం రాబోతుందని శాండిల్ వుడ్ వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి.

రామయణ్ సినిమాలో ముందుగా రాముడి పాత్ర కోసం రణ్ బీర్ కపూర్ అనుకున్నారు. అలాగే రావణసురుడి పాత్ర కోసం హృతిక్ రోషన్ ను ఫిక్స్ చేశారు. అయితే హృతిక్ రోషన్ ఇటీవల బాలీవుడ్ లో వచ్చిన విక్రమ్ వేదలో విలన్ పాత్ర చేశాడు. అది హిందీ ప్రేక్షకులకు ఎక్కువగా నచ్చలేదు. దీంతో మరోసారి విలన్ పాత్ర చేయాలని హృతిక్ భావించడం లేదట. దీంతో నిర్మాతలు రావణాసుర పాత్ర కోసం మరో హీరో వెతికే పనిలో ఉన్నారని టాక్ వస్తుంది.

- Advertisement -

అందులో భాగంగానే యష్ ను సంప్రదించారట. ప్రస్తుతం యష్ తో కథపరమైన చర్చలు జరుగుతున్నాయని సమాచారం. యష్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. 1500 కోట్ల ప్రాజెక్ట్ లో కీలక పాత్ర చేస్తాడు. మరి ఈ భారీ ప్రాజెక్ట్ కి యష్ ఓకే అంటాడా లేదా చూడాలి మరి.

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు