Renu Desai : చాలా కాలం తర్వాత

బద్రి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు రేణు దేశాయ్. చేసింది రెండు సినిమాలే అయిన పవన్ కళ్యణ్ తో పెళ్లి తర్వాత మంచి ఫాలోయింగ్ ను అందుకున్నారు. జానీ సినిమా తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు ఈ హీరోయిన్. ఇండస్ట్రీకి దూరం కాగ ముందు.. ప్రొడ్యూసర్ గా, కాస్ట్యూమ్ డిజైనర్ తో పాటు ఎడిటర్ గా కూడా పలు సినిమాలకు పని చేసారు.

పవన్ తో డైవర్స్ అయ్యాకా.. వెండి తెరపై రేణు దేశాయ్ కనిపించలేదు. ఇటీవల “రాధమ్మ కూతురు” అనే సీరియల్ లో గెస్ట్ రోల్ చేసి లో బుల్లి తెరపై మెరిసింది. కానీ వెండి తెరపైకి మాత్రం రాలేదు. అయితే ప్రస్తుతం రేణు దేశాయ్ చాలా సంవత్సరాల తర్వాత వెండి తెరకు రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతుంది.

మాస్ మహారాజ రవి తేజ నటిస్తున్న చిత్రం “టైగర్ నాగేశ్వర్ రావు”. ఈ చిత్రంలో హేమ లతా లవణం అనే పాత్రలో కనిపించబోతున్నారు రేణు దేశాయ్. ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేయగా ఫాన్స్ మంచి రెస్పాన్స్ ను అందుకుంటున్నారు ఈ హీరోయిన్. రేణు దేశాయ్ తన షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్టు ప్రకిటించారు చిత్ర బృందం.

- Advertisement -

కాగా ఈ చిత్రానికి వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియాగా స్థాయిలో తెరకేకించారు ఈ యంగ్ డైరెక్టర్. బ్యాచ్లర్ సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ను తెచ్చుకున్న GV ప్రకాష్ మ్యూజిక్ కంపోజ్ చేసారు.

నుపుర్ సనన్ మరియు గాయత్రి భరద్వాజ్ ఈ సినిమాలో మాస్ మహారాజా కు జంటగా నటించారు. కాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పై మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు