Ram Charan New Movie: ఇండియన్ 3… గ్లోబల్ స్టార్‌ని గట్టిగానే వాడేస్తున్నారు

సాధారణంగా రూమర్స్ అనేవి ఒక వ్యక్తికి గానీ, సినిమాకు గానీ, సంస్థకు గానీ చెడు చేసేలా ఉంటాయి. కానీ, ఈ మధ్య తెలుస్తుంది.. రూమర్స్ కూడా మంచికే అని. ఎలా అంటారా..? ఇటీవల విజయ్ దళపతి లియో సినిమాలో రామ్ చరణ్ అంటూ తమిళ మీడియా స్టార్ట్ చేసిన ఓ రూమర్… ఎలాంటి బజ్ లేని లియో సినిమా స్వరూపాన్నే మార్చేసింది. ట్రైలర్‌తో ఉన్న హైప్‌ను కిల్ చేసుకున్న ఈ మూవీలో రామ్ చరణ్ కోబ్రా అనే పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ పెద్ద ఎత్తున రూమర్స్ వచ్చాయి.

దీనిపై మూవీ టీం కూడా రియాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే, ఇప్పటి వరకు ఈ సినిమాకు కిల్ అయిన హైప్ మొత్తం ఈ రూమర్ తోనే మళ్లీ వచ్చేసింది. ఇందులో నిజం లేదని అందరికీ తెలుసు. కానీ, ఎవరూ కూడా ఈ రూమర్‌ని అపడానికి ట్రై చేయలేదు.

ఇదిలా ఉంటే, తాజాగా తమిళ నాట మరో రూమర్ తెగ వైరల్ అవుతుంది. లేదు… పని గట్టుకుని వైరల్ అయ్యేలా చేస్తున్నారు. అది కూడా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించే. గ్లోబల్ స్టార్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శంకర్ ఇదే సమయంలో కమల్ హాసన్‌తో ఇండియన్ 2 చేస్తున్నాడు. అయితే ఇండియన్ 2 సినిమాలో ఇండియన్ 3కి సంబంధించి క్లూ ఉంటుందని, ఇండియన్ 3లో రామ్ చరణ్ హీరోగా చేయబోతున్నాడు అంటూ ఓ గాసిప్ వదిలారు తమిళ మీడియా.

- Advertisement -

ప్రస్తుతం ఈ గాసిప్ అన్ని ఇండస్ట్రీలోకి పాకింది. ఈ గాసిప్ కి మరింత మసాల యాడ్ చేసి వైరల్ చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ తో శంకర్ పైన రామ్ చరణ్ కి పాజిటివ్ ఓపినియన్ వచ్చిందని, దీంతో వీరి కాంబోలో మరో సినిమా రాబోతుందని, అది ఇండియన్ 3 అంటూ వార్తలు రాసేస్తున్నారు.

నిజానికి ఇండియన్ 3ని తెరకెక్కించే ఆలోచన డైరెక్టర్ శంకర్ కే లేదు. ఇండియన్1, ఇండియన్ 2 కి చాలా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఇండియన్ 3 అంటే అయ్యే పని కాదు. ఇది తెలిసి కూడా రామ్ చరణ్ సినిమాలపై వార్తలను వైరల్ చేస్తూనే ఉన్నారు. ఇటీవల రాజ్ కుమార్ హిరానీతో రామ్ చరణ్ సినిమా అంటూ కూడా ఓ న్యూస్ వచ్చిన సంగతి తెలిసిందే. అది మరవక ముందే, లియో… ఇండియన్ 3 అంటూ మరి కొన్ని గాసిప్స్ వస్తున్నాయి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు