Hi Nana: ఆరేళ్ళ పాప ముందు లిప్ లాక్ గురించి ప్రశ్న, ఇదేనా సినీ జర్నలిజం.?

ఒకప్పుడు సినిమా రిలీజ్ అయితే గోడమీద పోస్టర్లు మాత్రమే కనిపించేవి. కానీ రోజులు మారుతున్న కొద్దీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా మార్పులు జరిగాయి. ఆ మార్పులు ఎలాంటివి అంటే, ఒక అప్డేట్ ఇవ్వడానికి కూడా ఒక అప్డేట్ ఇస్తున్నారు ఈ మధ్య మూవీ మేకర్స్. రీసెంట్ టైమ్స్ లో ఒక సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్, టైటిల్, గ్లిమ్స్, టీజర్ అంటూ రకరకాల అప్డేట్స్ ఇస్తూ ఆ తరువాత సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్
చేస్తున్నారు.

అలానే సాంగ్స్ తో సినిమాపై అంచనాలను పెంచే విధంగా ప్రమోషన్ చేస్తున్నారు. ఇంకా రీసెంట్ టైమ్స్ లో టీజర్ లాంచ్ ని కూడా ఒక ఈవెంట్ లా చేస్తుంటారు. ఆ ఈవెంట్ లో హాజరైన చిత్ర బృందానికి పలు ప్రశ్నలు ఎదురవడం సహజం. రీసెంట్ టైమ్స్ లో ఆ ప్రశ్నలు ఎంత దిగజారుడుతనంగా తయారయ్యాయి అనడానికి నిదర్శనం కొన్ని వీడియోలను చూస్తే మనకు తెలుస్తుంది.

బేసిగ్గా ఆయా సినిమాల చిత్ర బృందాలు ఆ సినిమా ప్రమోషన్ కి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారని అవి ఇంకా సినిమాపై ప్రేక్షకులుకు అంచనాలను పెంచుతాయి అని ఆ టీమ్స్ ఆశపడుతుంటాయి. కానీ కొన్ని ప్రశ్నలు చూస్తుంటే యూట్యూబ్ వ్యూస్ కోసమే అన్నట్లు ఉంటుంటాయి.

- Advertisement -

ఇకపోతే రీసెంట్ గా నాని నటించిన సినిమా హాయ్ నాన్న. ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. ఈ టీజర్ ఈవెంట్ లో నానికి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. దాంట్లో ఒకటో రెండో ప్రశ్నలు మినహా మిగతా ప్రశ్నలన్నీ సినిమాకి సంబంధం లేనివిగానే ఉన్నాయి. రీసెంట్ గా ఒక క్వశ్చన్ నానిని బాగా ఇబ్బంది పెట్టింది. ఒక సదరు జర్నలిస్ట్ మీ సినిమాల్లో ఈ మధ్యన లిప్ లాక్స్ ఎక్కువ ఉంటున్నాయి, అవి మీరు అడుగుతున్నారా డైరెక్టర్లు పెడుతున్నారా అనేది అతడి ప్రశ్న.

ఆ ప్రశ్నకు నాని చాలా పద్ధతిగా స్పందిస్తూ, తన లాస్ట్ సినిమా “దసరా”, మరియు “అంటే సుందరానికి” సినిమాల ప్రస్తావని తీసుకొచ్చి క్లారిటీ ఇచ్చాడు. “హాయ్ నాన్న” అనేది సినిమా ఫాదర్ సెంటిమెంట్ కి సంబంధించిన సినిమా. నాని పక్కనే ఒక ఆరేళ్ల పాప కూడా కూర్చుని ఉంది. సో ఆ టైంలో కూడా ఆ సదరు జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న ఎంతో మందికి ఇబ్బందిగా అనిపించింది. కానీ అదే టైంలో నాని జవాబు ఇచ్చిన తీరు చాలా అద్భుతం. చాలా పద్ధతిగా జవాబిస్తూ ఆ ప్రశ్నను దాటాడని చెప్పొచ్చు. ఏదైనా సినిమాకు ఉపయోగపడే ప్రశ్నలు అడిగితే కొంతవరకు బాగుంటుంది. కానీ ఇలాంటి ప్రశ్నలను కేవలం వ్యూస్ కోసం అడుగుతూ , పిల్లలకు కూడా తెలియని ఎమోషన్ ను పరిచయం చేయటం ఎంతవరకు కరెక్టు అనేది కొందరు అభిప్రాయం. తెలుగు సినిమా ఇప్పుడిప్పుడే ఎల్లలు దాటుతుంటే తెలుగు సినిమా జర్నలిజం ఏమవుతుంది అనేది కొందరి ఆలోచన.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు