Game Chenger: మాస్ రచ్చ చేస్తున్న రామ్ చరణ్ అభిమానులు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన స్థాయిని అంతకంతకు పెంచుకుంటూ పోతున్నాడు. మగధీర తో స్టార్ అయిన రామ్ చరణ్ ధ్రువ, రంగస్థలం లాంటి చిత్రాలతో నటనలో తండ్రికి తగ్గ కొడుకుగా వారసుడిగా మెగా లెగసి ని కంటిన్యూ చేస్తున్నాడు. అటు బాబాయ్ అభిమానుల ప్రేమను కూడా పొందుతూ రామ్ చరణ్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాడు. RRR చిత్రంతో ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిన రామ్ చరణ్ తన అభిమానుల దృష్టిలో అంతకంతకు తన స్థాయిని పెంచుకుంటున్నాడు. అటు టాలీవుడ్ లోను టాప్ హీరోగా తన స్థానాన్ని కొనసాగిస్తూ వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు.

ఆర్ఆర్ఆర్ తర్వాత ఆచార్యతో వచ్చిన రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ తో గేమ్ చేంజర్ చేస్తున్నాడు. ఈ మధ్యే సినిమా షూటింగ్ కు కొంత విరామం ఇచ్చిన చరణ్ ఇటీవల కాశ్మీర్ లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన జి20 సదస్సులో పాల్గొన్న రామ్ చరణ్ అక్కడ తన స్పీచ్ తో అదరగొట్టేసాడు.

ఇక తాజాగా రామ్ చరణ్ అభిమానుల వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియో ఎక్కడిదని ఆరా తీస్తే ఆంధ్రప్రదేశ్ లోని ఎమ్మిగనూరు జిల్లా లో గుడికల్ గ్రామంలో ఆ ఊరి జాతర సందర్భంగా అక్కడి రామ్ చరణ్ అభిమానులు గేమ్ చేంజర్ లో ఫ్లాష్ బ్యాక్ లుక్ లోని పంచెకట్టులో ఉన్న రామ్ చరణ్ గెటప్ ని అభిమానులు వేసుకుని వీధుల్లో తిరిగి రచ్చ చేసారు. ఇది కాస్తా సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. ఇక ప్రస్తుతం గేమ్ చేంజర్ షూటింగ్ లో ఉన్న రామ్ చరణ్ అది పూర్తవగానే బుచ్చిబాబు సాన తో సినిమా చేస్తున్నాడు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు