Rajamouli : హాలీవుడ్ స్థాయికి..

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శక ధీరుడు రాజమౌళి గురించి తెలియని వారు ఎవరు  ఉండరు. ప్రస్తుతం హాలీవుడ్ రేంజ్ లో గుర్తింపు సంపాదించుకున్నారు రాజమౌళి.  ముఖ్యంగా బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా లెవల్ కి తీసుకెళ్లారు. రాజమౌళి హిట్ సినిమాల్లో మగధీర ఒకటి. మగధీర సినిమాతో రామ్ చరణ్, బాహుబలితో ప్రభాస్, ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ ని అమాంతం పెంచేసిన డైరెక్టర్ గా రాజమౌళి రికార్డులకెక్కారు.  ముఖ్యంగా ఆర్ ఆర్ ఆర్ సినిమాలో  తారక్, చరణ్ నటనకు, జక్కన్న స్క్రీన్ ప్లే కు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. హాలీవుడ్ దర్శకులు సైతం రాజమౌళిని పొగడ్తలతో ముంచెత్తారు. 

అవేంజర్స్ వంటి క్రేజీ సిరీస్ తెరకెక్కించిన దర్శకుడు రూసో బ్రదర్స్ ఇటీవలే రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా చూసి ఫిదా అయ్యారు. తాజాగా యూఎస్ లో నిర్వహించే హాలీవుడ్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫెస్ట్ లో రాజమౌళి సినిమాలు కొన్ని ప్రదర్శన చేస్తున్నారట. ముఖ్యంగా అధిక సంఖ్యలో ఆడియెన్స్ హాజరయ్యే ఈ ఫెస్ట్ లో సెప్టెంబర్ 30న RRR ని, టీసీఎల్ థియేటర్ ఐమ్యాక్స్ లో ప్రదర్శన చేయగా తరువాత ముబీ థియేటర్ లో అక్టోబర్ 01న ఈగ, బాహుబలి 1, 2, అదేవిధంగా అక్టోబర్ 21న మగధీర, 23న మర్యాద రామన్న చిత్రాలు థియేటర్ లో ప్రదర్శించనున్నారు. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 11 వరకు ఈ ఫెస్ట్ కొనసాగుతుంది. రాజమౌళి చిత్రాలు టాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి వచ్చాయని, వాటిని ప్రదర్శిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. దీంతో రాజమౌళి ఖాతాలో మరో అరుదైన ఘనత వచ్చిందనే చెప్పవచ్చు. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు