Pushpa -2: అప్పుడే బిజినెస్ మొదలుపెట్టిన పుష్ప-2..!!

Puspa -2:  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 2021 లో వచ్చిన పుష్ప సినిమా భారీ విజయాన్ని అందుకుంది. మొదట కాస్త నెగిటివ్ టాక్ వచ్చినా నెమ్మదిగా ఈ సినిమా హైప్ పెరిగి భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా బాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టింది. అల్లు అర్జున్ కు జోడిగా రష్మిక నటించారు. స్పెషల్ సాంగ్ లో సమంత కూడా నటించింది. విలన్ గా ఫహాద్ ఫాజిల్ నటించారు. డీ గ్లామరస్ పాత్రలో ఈ చిత్రంలోని నటీనటులు ఎంతో అద్భుతంగా నటించారు. ఇక ప్రపంచవ్యాప్తంగా పుష్ప సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే..373 కోట్ల రూపాయలు రాబట్టినట్లుగా తెలుస్తోంది.

ఈ చిత్రంతో అల్లు అర్జున్ జాతీయ నటుడుగా కూడా అవార్డు అందుకున్నారు. ఇప్పటికీ పుష్ప సినిమాలోని పాటలు పలు రకాల డైలాగులు, రీల్స్ అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటాయి.అందుకే  పుష్ప-2 చిత్రాన్ని మరింత అద్భుతంగా తెరకెక్కించే పనిలో పడ్డారు సుకుమార్ . ఇటీవల ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అంటూ అభిమానులు కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఈ చిత్రంపై రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి బజ్ ఏర్పడుతోంది.

ఇదంతా ఇలా ఉండగా పుష్ప -2 చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ వారు దాదాపుగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ పెడుతున్నారు. అయితే నాన్ థియేట్రికల్ రైట్స్ వల్ల 200 కోట్ల రూపాయల వరకు బిజినెస్ జరుగుతుందని నిర్మాతలు అంచనా వేస్తున్నారు. కానీ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం ఈ మధ్యకాలంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తూ సినిమాలను కొంటున్నారు.. పెద్ద సినిమాలకు ప్రేక్షకాదరణ ఎలా ఉంది? ఎన్ని రోజులు సినిమా థియేటర్లో కలెక్షన్స్ నడుస్తుంది? అనే విషయాన్ని పరిగణలోకి తీసుకొని మరీ సినిమాలను తీసుకుంటున్నారు..

- Advertisement -

ఈ లెక్కన చూసుకుంటే  రూ.160 కోట్ల వరకు పుష్ప-2 మూవీ బిజినెస్ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.. సంక్రాంతి సీజన్ లో తప్ప మరెప్పుడు విడుదలైనా ప్రేక్షకులను థియేటర్లకి వచ్చేలా చేయలేకపోతున్నాయి.. రాజమౌళి వంటి డైరెక్టర్లు సినిమా తీస్తే తప్ప ప్రేక్షక ఆదరణ ఉండడం లేదు.. ఆంధ్రాలో రూ.60 కోట్లు బిజినెస్ జరిగిన సలార్ మూవీ ఇంకా ఇప్పటికి బ్రేక్ ఈవెన్ రాలేదు.. దీన్ని బట్టి చూస్తే పుష్ప-2 సినిమా రూ .60 కోట్ల షేర్ ని ఏపీలో రాబట్టడం కష్టము.. కానీ మైత్రి మూవీ మేకర్స్ వారు దాదాపుగా రూ.100 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.మరి నైజాంలో రూ.70 నుంచి రూ.75 కోట్ల బిజినెస్ అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ స్థాయిలో బిజినెస్ జరుగుతుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు