Poorna : అతడెప్పటికీ నా వాడే

శ్రీ మహాలక్ష్మీ, అవును, సీమ టపాకాయ్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళీ భామ పూర్ణ. హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసిన పూర్ణ, ప్రస్తుతం బుల్లితెరపై న్యాయ నిర్ణేతగా సందడి చేస్తుంది. అయితే ఈ నటి ప్రస్తుతం ఎక్కువగా వార్తలలో నిలుస్తుంది. ఇటీవల తన చిన్న నాటి స్నేహితుడు, యూఏఈ వ్యాపార వేత్త అయిన షనీద్ అషిఫ్ అలీతో నిశ్చితార్థం అయిన సంగతి తెలిసిందే. తనకు ఎంగేజ్ మెంట్ అయినట్లు, కాబోయే వరుడితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసి అందరికీ పరిచయం చేసింది. చాలా సంవత్సరాల నుంచి స్నేహితులుగా ఉన్న ఈ ఇద్దరు పెద్దలను ఒప్పించి నిశ్చితార్థం చేసుకున్నారు.

అయితే గత కొన్ని రోజుల నుండి పూర్ణ తన నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకుందని వార్తలు వస్తున్నాయి. తన కాబోయే వరుడు షనీద్ అషిఫ్ అలీకి పూర్ణకు మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చాయని, దీంతో ఇద్దరు విడిపోయారని సోషల్ మీడియాలో తెగ వార్తలు వచ్చాయి. మొదట్లో పూర్ణ స్పందించక పోవడంతో ఈ వార్తలు రోజుకు రోజుకు పెరిగాయి. తాజాగా నటి పూర్ణ ఈ వార్తలపై స్పందించింది.

ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన కాబోయే వరుడు షనీద్ అషిఫ్ అలీని కౌగిలించుకుని, సిగ్గుపడుతున్న ఒక ఫోటోను షేర్ చేసింది. అలాగే ‘అతడెప్పటికీ నా వాడే’ అని రాసుకొచ్చింది. అలాగే లవ్ సింబల్స్ ను కూడా ఈ పోస్టులో జోడించింది. పూర్ణ చేసిన ఈ పోస్టుతో పెళ్లి క్యాన్సిల్ అయిందంటూ వచ్చిన వార్తలకు పుల్ స్టాప్ పడింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు