Kollywood: PS 2 బిజినెస్ డీటెయిల్స్.. టార్గెట్ పెద్దదే

పొన్నియిన్ సెల్వన్ 2. మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ గా వస్తున్న ఈ సినిమా యొక్క మొదటి భాగం 2022 సెప్టెంబర్ లో విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ యొక్క రెండో భాగం PS 2 ఏప్రిల్ 28 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది. భారీ తారాగణం తో లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం స్వీయ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమా లో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, శోభిత ధూళిపాళ హీరో హీరోయిన్లు గా నటించారు. ఇక ప్రకాష్ రాజ్, రెహమాన్, ప్రభు, శరత్ కుమార్, జయరాం, ఐశ్వర్య లక్ష్మి, పార్తీబన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఏ.ఆర్ రహ్మాన్ సంగీతం అందించాడు.

తాజాగా పొన్నియన్ సెల్వన్ 2 యొక్క బిజినెస్ డీటెయిల్స్ వచ్చాయి. ఈ సినిమాను తెలుగు వెర్షన్ లో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక తమిళ నాడు లో ఈ సినిమాకు 80 కోట్ల బిజినెస్ జరగగా మణిరత్నం అక్కడ ఓన్ రిలీజ్ చేస్తున్నారు. ఇక కేరళ 9 కోట్లు, హిందీ, కర్ణాటక, రెస్ట్ అఫ్ ఇండియా కలిపి టోటల్ గా 21 కోట్లు జరగగా, ఓవర్సీస్ లో మాత్రం 50 కోట్ల బిజినెస్ జరిగింది. టోటల్ గా PS 2 సినిమాకు వరల్డ్ వైడ్ గా 170 కోట్ల బిజినెస్ జరిగింది. అంటే ఈ సినిమా హిట్ అవ్వాలి అనే దాదాపు 330 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేయాలి.

అయితే ఈ సినిమా కి ఉన్న హైప్ దృష్ట్యా భారీ ఓపెనింగ్స్ రావడం కష్టమనే చెప్పాలి. ఎక్కడా మినిమం బుకింగ్స్ కూడా జరగడం లేదు. తెలుగులో అయితే ఏజెంట్ కు పోటీగా రిలీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఓపెనింగ్స్ కష్టం. అయితే పొన్నియన్ సెల్వన్ 2 కి మంచి టాక్ వస్తే మాత్రం భారీ వసూళ్లు అందుకునే అవకాశం ఉంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు